బాసూ ఎందుకు ఈ ' హగ్స్ రచ్చ'?

By iDream Post Sep. 21, 2021, 08:10 pm IST
బాసూ ఎందుకు ఈ ' హగ్స్ రచ్చ'?

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. అయితే మూడో వారానికి గాను ఎలిమినేషన్ ప్రక్రియ కోసం మొదలుపెట్టిన నామినేషన్ల ప్రక్రియే ఇప్పుడు పెను విధ్వంసానికి దారితీసినట్టు అయింది. సాధారణంగా ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎవరికీ అర్థం కాని కాన్సెప్ట్. అప్పుడెప్పుడో ఆరుగురు సంపన్నులను ఒక ఇంట్లో పెట్టి ఏడాది పాటు ఉంచితే వాళ్ల మనస్తత్వాలు ఎలా ఉంటాయి ? అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించగా అది కాలక్రమేణా మారుతూ వచ్చి ఇప్పుడు వంద రోజుల కార్యక్రమంగా రూపాంతరం చెందింది. ఇక్కడ దాదాపు సెలబ్రిటీలు అందరూ ఒకే స్థాయి వారిని తీసుకువచ్చి పెడతారు. ఒకరిద్దరు మనకు తెలియని ముఖాలు ఉండవచ్చు. అయితే లోపల ఉన్న స్త్రీ పురుషుల మధ్య కావాలని ట్రాకులు నడుపుతున్నారో లేక వాళ్ళ మధ్య నిజంగానే ఆకర్షణ ఏర్పడి ప్రేక్షకులకు ఆ భావన కలుగుతుందో అర్థం కావడం లేదు.

అయితే తాజా ఎపిసోడ్ లో జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం చూస్తున్న ప్రేక్షకులందరికీ ఎబ్బెట్టుగా అనిపించింది. నిన్న నామినేషన్ ప్రక్రియలో భాగంగా లహరి అనే కంటెస్టెంట్ ఎక్కువగా హౌస్ లో మగాళ్లతో తిరుగుతోంది అంటూ ప్రియ అనే మరో కంటెస్టెంట్ ఆరోపించింది. సదరు ప్రియ పాయింట్ ఏంటంటే మొదట్లో లహరి తనతోనే ఎక్కువగా సమయం గడిపేది కానీ ఈ మధ్య ఎక్కువగా మగవాళ్ళతో గడుపుతూ వాళ్లతోనే ఉంటుందనేది ప్రధాన ఆరోపణ. దానికి ఉదాహరణగా చెబుతూ ఒక అర్ధరాత్రి బాత్రూంలో యాంకర్ రవిని హగ్ చేసుకుంటూ కనిపించారని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరి ఫ్యూజులు ఎగిరిపోయే పరిస్థితి. సినిమాలలో చిన్నాచితక క్యారెక్టర్లు చేసి మంచి నటిగా పేరు తెచ్చుకున్న ప్రియా సీరియల్స్ లో సైతం రాణిస్తోంది. నిజం చెప్పాలంటే ఒకరకంగా ఆమెకు చాలా మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. అలాంటి ప్రియా ఇలాంటి కామెంట్స్ చేస్తే జనం నమ్మేస్తారు అని అనుకుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు జనం చేతిలో ఆమె అభాసుపాలు అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎందుకంటే ఆమె చెబుతున్నట్టు హగ్స్ చేసుకోవడం అనేది బిగ్ బాస్ లో డే వన్ నుంచి కామన్ అయింది. ఇప్పుడు అదే తప్పు అన్నట్టుగా ఆమె మాట్లాడడంతో సోషల్ మీడియా మొత్తం ఆమెను టార్గెట్ చేసింది. అయితే దానికి కొనసాగింపుగా ఈరోజు రాబోతున్న ఎపిసోడ్ లో కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటిదాకా ప్రియను మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఎంతో సంస్కారం ఉందని భావిస్తే ఇలాంటి కామెంట్లు చేస్తూ అటు రవి కుటుంబంలో ఇటు లహరి కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులందరూ బాధపడే లాగా కామెంట్ చేయడం సరికాదని సుద్దులు చెబుతున్నారు. బిగ్ బాస్ అంటేనే కాంట్రోవర్సీ కాంట్రవర్సీ అంటేనే బిగ్ బాస్ కావడంతో ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తారు తప్ప ఇలాంటి గొడవలను బిగ్ బాస్ నిర్వాహకులు కళ్లెం వేసారని అనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది.

Also Read : 13 ఏళ్ళ తర్వాత దర్శకత్వం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp