iDreamPost

100 కోట్ల మోసం కేసులో ప్రకాశ్‌ రాజ్‌కు నోటీసులు!

నటుడు ప్రకాశ్‌ రాజ్‌ 100 కోట్ల రూపాయల ఓ స్కామ్‌లో చిక్కుకున్నారు. కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు..

నటుడు ప్రకాశ్‌ రాజ్‌ 100 కోట్ల రూపాయల ఓ స్కామ్‌లో చిక్కుకున్నారు. కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు..

100 కోట్ల మోసం కేసులో ప్రకాశ్‌ రాజ్‌కు నోటీసులు!

ప్రముఖ బహు భాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ చిక్కుల్లో పడ్డారు. 100 కోట్ల రూపాయల మోసం కేసులో ఆయనకు నోటీసులు వెళ్లాయి. తమిళనాడులో జరిగిన ఓ స్కీం స్కాంకు సంబంధించి ఈడీ ప్రకాశ్‌ రాజ్‌కు నోటీసులు ఇచ్చింది. త్వరలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ స్కాంలో ప్రకాశ్‌ రాజ్‌ ప్రమేయం ఉందా? లేదా? తెలుసుకోవటానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. త్వరలో ప్రకాశ్‌ రాజ్‌ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రకాశ్‌ రాజ్‌ తమిళనాడులోని తిరుచురాపల్లికి చెందిన ప్రణవ్‌ జ్యువెలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ ప్రణవ్‌ జ్యువెలర్స్‌ ‘‘ పొంజి’’ పేరిట ఓ స్కీం అమలు చేస్తోంది. గోల్డ్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ స్కీం కావటంతో పెద్ద మొత్తంలో జనం డబ్బు దాచుకున్నారు. జనం దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బుల్ని ఆ స్కీంలో పెట్టారు. అయితే, ప్రణవ్‌ జ్యువెలరీ యజమానులు ఇచ్చిన మాట తప్పారు. డబ్బులు, బంగారం రెండిటిలో ఏదీ కూడా జనానికి తిరిగి ఇవ్వలేకపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రణవ్‌ జ్యువెలరీపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, 100 కోట్ల భారీ స్కాం కావటంతో కేసు ఈడీకి చేరింది. ఈడీ అధికారులు తాజాగా, ప్రణవ్‌ జ్యువెలరీకి సంబంధించిన ఆఫీస్‌, ఇతర ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీగా లెక్కకు చూపని నగదు, బంగారం లభించింది. దాదాపు 23.70 లక్షల నగదుతో పాటు 11.60 కేజీ బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. నవంబర్‌ 20న ఈ సోదాలు జరిగాయి. ఆ వెంటనే ప్రకాశ్‌ రాజ్‌కు ఈడీ నోటీసులు పంపింది. డిసెంబర్‌ 5న చెన్నైలోని ఆఫీసు ముందు హాజరుకావాలని ఆదేశించింది.

కాగా, ప్రకాశ్‌ రాజ్‌ వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఆయన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఓజీ సినిమాలో నటిస్తున్నారు. ఓజీతో పాటు మహేష్‌ బాబుతో ‘గుంటూరు కారం’.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో ‘దేవర’.. అల్లు అర్జుణ్‌తో పుష్ప 2లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఆయన నటించిన తాజా చిత్ర ‘కుంజమ్మనిస్‌ హాస్పిటల్‌’ అనే మలయాళ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక, ప్రకాశ్‌ రాజ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉంటారు. తనకు నచ్చని ప్రభుత్వ విధానాలపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ ఉంటారు. అవే కొన్ని సార్లు ఆయన్ని వివాదాల్లో పడేస్తున్నాయి. మరి, 100 కోట్ల పొంజి స్కీం స్కాంలో ప్రకాశ్‌ రాజ్‌కు ఈడీ నోటీసులు జారీ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి