iDreamPost
android-app
ios-app

ప్రకాశ్ రాజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన దిల్ రాజు

  • Published Oct 10, 2023 | 2:39 PM Updated Updated Oct 10, 2023 | 2:39 PM
  • Published Oct 10, 2023 | 2:39 PMUpdated Oct 10, 2023 | 2:39 PM
ప్రకాశ్ రాజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన దిల్ రాజు

టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గురించి తెలియని వారుండరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై  అనేక సినిమాలు నిర్మించారు. సక్సెస్ ఫుల్ సినిమాలతో  టాప్ నిర్మాతగా మారారు. ఆయన బ్యానర్ లో సినిమాలు చేసేందుకు సీనియర్ హీరోలే కాకుండా యంగ్ హీరోలు కూడా ఊవిళ్లూరుతుంటారు. సినీ డిస్ట్రిబ్యూటర్ నుండి బడా నిర్మాతగా మారారు రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు తీవ్ర దు:ఖంలో ఉన్నారు.  ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యాం సుందర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్యామ్ సుందర్ మరణించారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు దిల్ రాజును పరామర్శించారు.

దిల్ రాజు తండ్రి మరణ వార్త తెలిసిన ప్రకాశ్ రాజ్.. శ్యామ్ సుందర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సమయంలో దిల్ రాజు ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ప్రకాశ్ రాజ్ పరామర్శిస్తుండగా.. ఒక్కసారిగా  భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక.. ఏడ్చేశారు. ప్రకాశ్ రాజ్ ఛాతీపై తన ఆన్చి.. కంటతడి పెట్టుకున్నారు. కాగా, శ్యామ్ సుందర్ రెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లా. ఆయనకు దిల్ రాజు కాకుండా ఇద్దరు కుమారులు ఉన్నారు. దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో చనిపోవడంతో.. 2020లో తేజశ్వినిని రెండో వివాహం చేసుకున్న సంగతి విదితమే.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet