iDreamPost

హనుమాన్ vs శ్రీఆంజనేయం! పాపం తప్పు అంతా ఛార్మిపై నెట్టేశారు!

సంక్రాంతికి చిన్న మూవీగా విడులయ్యి.. పెద్ద హిట్ దక్కించుకున్న చిత్రం హనుమాన్. రూ. 40 కోట్లతో తెరకెక్కిన ఈచిత్రం.. రూ. 300 కోట్లను క్రాస్ చేసేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఘన విజయం సాధించడంతో మరో సినిమా పేరు ప్రస్తావనకు వస్తుంది. అదే శ్రీ ఆంజనేయం

సంక్రాంతికి చిన్న మూవీగా విడులయ్యి.. పెద్ద హిట్ దక్కించుకున్న చిత్రం హనుమాన్. రూ. 40 కోట్లతో తెరకెక్కిన ఈచిత్రం.. రూ. 300 కోట్లను క్రాస్ చేసేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఘన విజయం సాధించడంతో మరో సినిమా పేరు ప్రస్తావనకు వస్తుంది. అదే శ్రీ ఆంజనేయం

హనుమాన్ vs శ్రీఆంజనేయం! పాపం తప్పు అంతా ఛార్మిపై నెట్టేశారు!

ఇతిహాస గాధలను, పురాణాలను సినిమాలుగా రూపొందించడంలో అందే వేసిన చేయి తెలుగు ఇండస్ట్రీది. రామాయణ, మహా భారత కథలను సినిమాలుగా అత్యధికంగా తెరకెక్కించింది కూడా బహుశా టాలీవుడ్డే అయ్యి ఉంటుంది. అలాగే దేవుడి లీలలు, మహాత్యం మీద కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. భక్త ప్రహ్లాద నుండి నేటి హనుమాన్ వరకు చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే పాత పురాణ గాధలను ఇప్పటి తరానికి అందించేందుకు డిఫరెంట్‌గా ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒక్కోసారి బెడిసి కొడుతుంటాయి. అటువంటి మూవీల్లో ఒకటి.. వర్సటైల్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం. నితిన్, ఛార్మీ హీరో, హీరోయిన్లుగా, అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపించారు. అప్పట్లో ఆ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఇప్పుడు వచ్చిన హనుమాన్ మూవీ ఇలాంటి స్టోరీనే. చిన్న సినిమాగా వచ్చి రూ. 300 కోట్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు చాలా మంది నెటిజన్లు శ్రీ ఆంజనేయం మూవీ గురించి మాట్లాడుతున్నారు. ‘ నాకెందుకో హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం మూవీనే నచ్చింది. ఎందుకో తెలియదు. సూపర్ సినిమా. కానీ కొంత మందికి అర్థం కాలా’ అంటూ కామెంట్ చేశాడో ట్విట్టర్ యూజర్. దీనికి శ్రీ ఆంజనేయం డైరెక్టర్ కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. ‘ప్రేక్షకుల నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు..వారికి నచ్చలేదు అంటే సినిమా సరిగా తెరకెక్కించలేదని అర్థం. ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్లకు నచ్చలేదు. వారిని నిందించొద్దు. ధాంక్యూ’ అంటూ కామెంట్ చేశారు.

మరో నెటిజన్.. ఛార్మీ క్యారెక్టర్ టూ మచ్ ఇరిటేటింగ్ అంటూ కామెంట్ చేయగా.. దానికి కూడా గాడ్ బ్లస్ యూ అంటూ సమాధానం ఇచ్చారు కృష్ణ వంశీ. కాగా, ఎక్కువ మంది ఛార్మీ వల్లే పోయిందని చెబుతున్నారు. ‘ఎక్కువ స్కీన్ షో ఉంది, మొత్తం ఛార్మీ ఎపిసోడ్ అలా ఉంది, పబ్లిసిటీ సమయంలో కూడా బోర్డర్ చుట్టూ శ్రీరామ అని పెట్టి.. మధ్యలో చార్మీ స్కిన్ షో పిక్చర్ పెట్టారు’ అంటూ  పేర్కొన్నాడో సోషల్ సైనికుడు. ఆమె సీన్లు కట్ చేసి రీ రిలీజ్ చేయండి అంటూ కోరుతున్నారు కొంత మంది. చార్మీ పోర్షన్ తీసేస్తే.. మంచి సినిమా అంటున్నారు. వాస్తవానికి ఇది ఇప్పటి మాట కాదూ.. అప్పట్లో కూడా ఛార్మీ వల్లే సినిమా పోయిందని అనుకున్నారు. ఛార్మీ ఓవర్ యాక్టింగ్, ఎక్స్ ఫోజింగ్ నచ్చలేదు.. కానీ అందులో ఛార్మీ తప్పులేదు. డైరెక్టర్ చెప్పినట్లు చేసింది. దర్శకుడు చెప్పకుండా ఆమె అలా చేయలేదు కదా. కానీ ఈ రోజు మంచి డైరెక్టర్‌గా కృష్ణ వంశీ గుర్తింపు పొందుతున్నాడు.  తప్పు అంతా ఛార్మిదే అన్నట్లుగా కథ మారిపోయిందని కొంత మంది అంటున్నారు. మీరేమంటారు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి