iDreamPost

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

సామాన్యులతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా ఏపీలో ఈ సంఖ్య రెండుకు చేరుకుంది. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే జె. సుధాకర్‌కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్థారించారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఎమ్మెల్యే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సుధాకర్‌ 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇప్పటికే విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయింది. ఈ నెల 10వ తేదీన అమెరికా నుంచి వచ్చిన ఆయనకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్సలో ఉన్నారు. తెలంగాణలో కరోనా బారిన పడిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన వారే కాగా, ఏపీలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార వైసీపీకి చెందిన వారే గమనార్హం. కరోనా బాధితుడుని కలిసిన నేపథ్యంలో టీడీపీ గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ నెల 19వ తేదీన జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ తన ఓటు వేయలేకపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి