iDreamPost

KL University: KL యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? పోలీసులు చెప్పిన నిజాలు!

  • Published Feb 14, 2024 | 1:17 PMUpdated Feb 14, 2024 | 1:17 PM

కేఎల్‌ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థిని, ఇద్దరు విద్యార్థులు మృతి చెందారంటూ సోషల్‌ మీడియాలో ఒక వార్త ప్రచారంలో ఉంది. ఈ ఘటనతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై తాజాగా పోలీసులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కేఎల్‌ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థిని, ఇద్దరు విద్యార్థులు మృతి చెందారంటూ సోషల్‌ మీడియాలో ఒక వార్త ప్రచారంలో ఉంది. ఈ ఘటనతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై తాజాగా పోలీసులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 14, 2024 | 1:17 PMUpdated Feb 14, 2024 | 1:17 PM
KL University: KL యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? పోలీసులు చెప్పిన నిజాలు!

విజయవాడలోని కేఎల్‌ యూనివర్సిటీకి సంబంధించి సంచలన విషయం వైరల్‌గా మారింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు చావులు జరిగాయంటూ.. ఆ యూనివర్సిటీ చుట్టూ వివాదం అల్లుకుంది. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు మృతి చెందారంటూ సోషల్‌ మీడియాలో ఒక వార్త స్ప్రెడ్‌ అయింది. దీంతో.. కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. యూనివర్సిటీలోని ఒక బిల్డింగ్‌పై నుంచి విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పోలీసులు ఘటనాస్థిలికి చేరుకున్నారు. ఘటన ఎలా జరిగిందని విచారణ చేస్తుండగా.. అదే బిల్డింగ్‌లోని రెండో ఫ్లోర్‌ నుంచి దుర్వాసన వచ్చింది.

ఏంటా అని పోలీసులు సెర్చ్‌ చేస్తే, ఒక పెద్ద బ్యాగులో ముక్కలుగా నరికిన యువతి మృతదేహం బయటపడింది. ఆ భాగాలు కాస్త కాలిపోయి కూడా ఉన్నాయి. అసలు ఆ బ్యాగ్‌ను యూనివర్సిటీలోకి ఎవరు తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు క్యాంపస్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ఓ విద్యార్థిని ఆ బ్యాగ్‌ను తీసుకొచ్చినట్లు తేలింది. ఆ విద్యార్థినిని పిలిచి పోలీసులు విచారించగా.. తనకు ఆ బ్యాగ్‌ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, మరో యువకుడు కలిసి ఇచ్చారని, యూనివర్సిటీ బ్యాక్‌సైడ్‌ పడేయాలని చెప్పినట్లు వెల్లడించింది. ఆ బ్యాగ్‌ను ఇచ్చిన చోటుకి పోలీసులు వెళ్లి పరిశీలించగా.. అక్కడ మరో యువకుడి మృతదేశం లభించింది. దీంతో పోలీసులు షాక్‌ అయ్యారు.

ఒక్కరి మృతిని విచారించేందుకు వస్తే.. ఇప్పుడు మరో రెండు మిస్టరీ మరణాలు బయటపడ్డాయి. ఈ మూడు చావులకు లింక్‌ ఉందని అనుమానించిన పోలీసులు.. విచారించగా.. ఇదో ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీగా బయటపడింది. ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించారు. తమలో ఎవరో ఒక్కరి ప్రేమను మాత్రమే అంగీకరించాలని, ఈ విషయం గురించి మాట్లాడడానికి ముగ్గురు ఒక చోటుకి చేరుకున్నారు. ఈ క్రమంలో మీ ఇద్దరినీ లవ్‌ చేయనని ఆ అమ్మాయి తెగేసి చెప్పడంతో.. ఇద్దరు యువకులు కోపంతో ఆ అమ్మాయిపై దాడి చేయడంతో ఆమె చనిపోయింది. ఆ మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక.. ఇద్దరు యువకులు కలిసి.. మృతదేహానికి నిప్పంటించారు. సగం కాలడంతో మళ్లీ బాడీని ముక్కలుగా నరికి.. ఒక బ్యాగ్‌లో కుక్కారు. ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లి యూనివర్సిటీలోని తమ స్నేహితురాలికి ఇచ్చి వర్సిటీ వెనుక వైపు పడేయాలని చెప్పారు.

ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగి.. ఇద్దరు ఘర్షణకు దిగారు. ఈ ఫైటింగ్‌లో ఒక యువకుడు మృతి చెందాడు. బతికినున్న యువకుడే.. యూనివర్సిటీకి వచ్చి భయంతో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటూ.. సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఇదంతా అవాస్తవం అంటూ.. పోలీసులు నిర్ధారించారు. అనారోగ్యంతో ఓ విద్యార్థి కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, అంత వరకే తాము ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్నామని, సోషల్‌ మీడియాలో వస్తున్నట్లు.. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి మృతి చెందింది, బ్యాగ్‌లో అమ్మాయి మృతదేహం లభించడం అంతా ఫేక్‌ న్యూస్‌ అంటూ పోలీసులు కొట్టిపారేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి