iDreamPost
android-app
ios-app

పెళ్లిదేముంది.. కథ నచ్చితే దేనికైనా రెడీ: కియారా

  • Author ajaykrishna Updated - 03:42 PM, Wed - 6 September 23
  • Author ajaykrishna Updated - 03:42 PM, Wed - 6 September 23
పెళ్లిదేముంది.. కథ నచ్చితే దేనికైనా రెడీ: కియారా

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ కెరీర్.. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అన్నట్లుగా సాగుతుంటుంది. ఎందుకంటే పెళ్లికి ముందు చేసిన రోల్స్ పెళ్లి తర్వాత చేయలేకపోతుంటారు. అలాగే పెళ్లి తర్వాత చేసే రోల్స్ పెళ్లి కాకముందు చేయలేరు. అయితే.. కొందరు మాత్రం పెళ్లి తర్వాత కూడా ఎలాంటి రోల్స్ చేయడానికైనా రెడీ అవుతుంటారు. పెళ్లికి ముందు ఫుల్ గ్లామర్ రోల్స్ చేసిన హీరోయిన్స్.. సడన్ గా పెళ్లి కాగానే గ్లామర్ కి దూరంగా ఉంటారు. అది వారి మ్యారేజ్ లైఫ్ పై ప్రభావం పడకుండా ఉండేందుకు ఫ్యామిలీస్ తో కలిసి నిర్ణయం తీసుకుంటారు. మరికొందరు పెళ్ళైనా.. ఫ్యామిలీస్ ని ఒప్పించి గ్లామర్ రోల్స్ చేస్తుంటారు.

అలా తనకు కూడా గ్లామర్ రోల్స్ కి పెళ్లి అనేది అడ్డు కాదని అంటోంది కియారా అద్వానీ. ఈ బాలీవుడ్ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేసిన ఈ భామ.. ఇప్పటిదాకా మళ్లీ తెలుగు వైపు చూడలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తోంది. పాన్ ఇండియా మూవగా ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. కాగా.. మొన్నటిదాకా బాలీవుడ్ లో సూపర్ ఫామ్ కొనసాగించిన కియారా.. రీసెంట్ గా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పెళ్లి తర్వాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా కొత్త సినిమాలు లైనప్ చేస్తోందట కియారా.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా.. తన సినిమాల గురించి, పెళ్లి తర్వాత కెరీర్ గురించి కిన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ రోల్స్ కి వెనకడుగు వేసే ఉద్దేశం లేదని అంటోంది అమ్మడు. కియారా మాట్లాడుతూ.. “పెళ్లి అయితే ఏంటి కథ నచ్చాలి గానీ ఎలాంటి రోల్స్ చేయడానికైనా నేను సిద్ధమే. కథ, పాత్రలను బట్టి గ్లామర్ షో చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. కథ నచ్చకుండా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా.. నేను ఒప్పుకోలేను. ఎందుకంటే.. ఇప్పుడు డబ్బు కోసం చూసుకుంటే నా కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుంది.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కియారా మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కియారా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş