iDreamPost
android-app
ios-app

జనసేన నేత నాదెండ్ల TDPకి కోవర్టు: కేతంరెడ్డి వినోద్ రెడ్డి

జనసేన నేత నాదెండ్ల TDPకి కోవర్టు: కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఏపీలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉంటున్నాయి. మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలే అందుకు కారణం. ఇదే సమయంలో అన్ని పార్టీలు  ఎన్నికల సమరానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో జనసేన పార్టీకి షాకులు తగులుతున్నాయి. ఇటీవలే కొందరు నేతలు జనసేనకు రాజీనామా  చేశారు. పార్టీ విధివిధానాలు సరిగ్గా లేవంటూ వ్యాఖ్యానించారు.  ఇటీవలే జనసేనకు రాజీనామా చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి నాదెండ్ల మనోహర్ పై ఓ రేంజ్ లో విరుచుక పడ్డారు. జనసేనాను నాశనం చేస్తుంది నాదెండ్ల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నెల్లూరు సిటీకి చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. ఎంపీ విజయ సాయి రెడ్డి వైసీపీలో చేరారు. అయితే వైసీపీ నేత కేతం రెడ్డి వినోద్  రెడ్డిపై జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. నాదెండ్ల్ వ్యాఖ్యలకు కేతంరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారం  మీడియాతో మాట్లాడుతూ నాదెండ్లపై  కేతంరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. వైసీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..” వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది.  సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం అందరికి విధితమే. అయితే ఈ రోజు జనసేన పార్టీలో నాలాంటి వారు ఎందరో పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలనే కోరికతో చాలా కష్టపడ్డారు.

నేను పని చేసింది పవన్ కల్యాణ్ గారి కోసమే. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ప్రతి ఇంటికి తిరిగాను కదా.. ఇంకా పచ్చికగా చెప్పాలంటే ఆయన కోసం శిలఫలకం వేశాను. ఈ రోజు దారుణం ఏమిటంటే పవన్ కల్యాణ్ గారి చేతిలో, పవన్ కల్యాణ్ గారి పార్టీ లేదు. నేను డబ్బులు తీసుకోని వచ్చాను, వైసీపీ కోవర్టునంటూ కొందరు నన్ను విమర్శిస్తున్నారు. నేను సూటిగా జనసేన నేతలను ఒక  ప్రశ్న అడుగుతున్నాను . మీరు ఎంత డబ్బులు ఇస్తే  జనసేన పార్టీలో నేను పని చేశాను. ఎంత డబ్బులు తీసుకుని నేను జనసేనాలోకి వచ్చాను. ఇంకా దారుణం ఏంటంటే ఎవరైనా పవన్ కల్యాణ్ కోసం కష్టపడతా ఉంటే .. వారిని పార్టీలో నుంచి బయటకు ఎలా పంపించాలా అనేది జనసేనాలో జరుగుతుంది.

పార్టీని ఎదగకుండా ఎలా చేయాలా అనేవి జరుగుతున్నాయి. అయితే ఇవ్వన్నీ పవన్ కల్యాణ్ గారికి తెలియదు. ఆయన పక్కన ఉన్న నెంబర్ టూ ఒకరు ఉంటారు. నాదెండ్ల మనోహర్ అనే ఒక బ్లాక్ హోల్ ని పవన్ కల్యాణ్ పెట్టుకున్నారు. ఎవరైనా పవన్ కల్యాణ్ కోసం నాలాగా కష్టపడే వారిని బయటకు పంపడం మీదే  నాదెండ్ల మనోహర్  పని చేస్తున్నారు. జనసేనను నాదెండ్ల మనోహర్  నాశనం చేస్తున్నారు. నాదెండ్ల వల్ల జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు” అంటూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbetHoliganbet Giriş