iDreamPost
android-app
ios-app

నారాయణ నిజస్వరూపం నాకు తెలుసు..: పొంగూరి ప్రియ

నారాయణ నిజస్వరూపం నాకు తెలుసు..: పొంగూరి ప్రియ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో మాజీ మంత్రి పి. నారాయణ పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ద్వారా భారీగా  లాభ పడినట్లు సీఐడీ అధికారులు ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసులు వ్యవహారం కోర్టులో సాగుతోంది. ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో భారీ అవినీతికి పాల్పడ్డాడని వైసీపీ నేతలు సైతం ఆరోపించారు. తాజాగా ఆయన మరదలు పొంగూరి ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడెక్కడ బినామీల పేర్లతో స్థలాలు ఉన్నాయో తనకు తెలుసంటూ ప్రియా కీలక వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో  ఏపీ సీఐడీకి విజ్ఞ్తి చేస్తూ కీలక విషయాలను వెల్లడించారు. సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని, కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్కడెక్కడ బినామీల పేరిట స్థలాలు ఆయనకూ ఉన్నాయో తనకు తెలుసని ప్రియా పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని, అలా చేస్తే దర్యాప్తునకు సాయం చేసినట్టవుతుందని ఆమె తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఐడీ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాని ఆమె అన్నారు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు దగ్గర తన స్థలం నారాయణకు గుర్తు ఉందని,  సీఐడీ అధికారుల విచారణలో మాత్రం ఆయనకు ఇవేమీ గుర్తు రావని ఆమె తెలిపారు.  కాబట్టి మీ విచారణలో తనను కూడా విచారిస్తే అన్ని విషయాలు చెబుతానని ఆమె తెలిపారు. ఒక వ్యక్తి  వల్ల తీగలాగితే డొంక కదులుతుందని, రింగ్‌ రోడ్‌ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆ  వ్యక్తి ఎవరో ఎంక్వైరీలో సీఐడీ అధికారులకు తాను చెబుతానని ఆమె అన్నారు. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు సహాయ పడుతుందని ఆ వీడియోలో పొంగూరి ప్రియ పేర్కొన్నారు. మరి.. పొంగూరి ప్రియా వీడియో ద్వారా చేసిన ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom