iDreamPost

పెళ్లికి లగ్జరీ ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిన కంగనా! ఆ వ్యక్తి ఎవరంటే?

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ఊహించని విధంగా ఓ వ్యక్తి పెళ్లికి లగ్జరీ ఇల్లునే గిఫ్ట్ కింద ఇచ్చేసింది. దాంతో లగ్జరీ ఇల్లు గిఫ్ట్ గా తీసుకున్న ఆ వ్యక్తి ఎవరు? కంగనాకు ఏమౌతాడు? ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ఊహించని విధంగా ఓ వ్యక్తి పెళ్లికి లగ్జరీ ఇల్లునే గిఫ్ట్ కింద ఇచ్చేసింది. దాంతో లగ్జరీ ఇల్లు గిఫ్ట్ గా తీసుకున్న ఆ వ్యక్తి ఎవరు? కంగనాకు ఏమౌతాడు? ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లికి లగ్జరీ ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిన కంగనా! ఆ వ్యక్తి ఎవరంటే?

సాధారణంగా పెళ్లికి చిన్న చిన్న గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు కామన్ పీపుల్. ఇక సెలబ్రిటీలు తమకు చాలా దగ్గరి వారు అయితే కార్లు, లేదా బంగారం బహుమతులుగా కొత్త దంపతులకు ఇస్తుంటారు. కానీ బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ మాత్రం ఊహించని విధంగా పెళ్లికి లగ్జరీ ఇల్లునే గిఫ్ట్ కింద ఇచ్చేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో లగ్జరీ ఇల్లు గిఫ్ట్ గా తీసుకున్న ఆ వ్యక్తి ఎవరా? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? కంగనాకు ఏమౌతాడు? ఇప్పుడు తెలుసుకుందాం.

కంగనా రనౌత్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే.. ప్రజా సమస్యలపై, మహిళా సమస్యలపై తనదైన శైలిలో గొంతెత్తేది. దాంతో బాలీవుడ్ లో కంగనాకు మిత్రులతో పాటుగా శత్రువుల కూడా ఎక్కువైపోయారు. ఇదంతా కాసేపు పక్కపెడితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందింది కంగనా. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తన కజిన్ వరుణ్ రనౌత్ పెళ్లి తాజాగా జరిగింది. అతడికి చిన్నా చితక గిఫ్ట్ లు ఇస్తే ఫీల్ అవుతాడేమోనని అనుకుంది కాబోలు.. మ్యారేజ్ కి ఏకంగా బహుమతి కింద లగ్జరీ ఇంటినే ఇచ్చేసింది. ఈ విషయన్ని తెలియజేస్తూ.. తన ఇన్ స్టా స్టోరీలో మెుత్తం అవే ఫోటోలను షేర్ చేసింది.

Kangana Ranut

తన కజిన్ కు చంఢీగడ్ లోని ఖరీదైన ఇంటిని గిఫ్ట్ కింద ఇచ్చేసింది కంగనా. దాంతో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది. ఇది తెలిసిన అభిమానులు.. తమ్ముడిపై ఎంత ప్రేముంటే మాత్రం లగ్జరీ ఇంటిని ఇస్తారా? మీ ప్రేమకు హ్యాట్సాఫ్ మేడం అంటూ కంగనాపై పొడగ్తలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ నటిగా అంచెలంచెలు ఎదుగుతూ.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. ఇక ఇప్పుడు ఎంపీగా కూడా గెలిచింది. ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ మూవీలో నటిస్తోంది. ఇందులో ఒకప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రాలో కంగనా నటిస్తోంది. మరి కంగనా రనౌత్ తన తమ్ముడి పెళ్లికి ఖరీదైన ఇంటిని గిఫ్ట్ గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Varun Ranaut (@varunranaut)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి