iDreamPost

కల్కి నుండి అశ్వత్థామ గ్లింప్స్ రిలీజ్.. ఇవి గమనించారా..?

డార్లింగ్ ప్రభాస్ , దీపికా పడుకొణే హీరో హీరోయిన్లుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ గ్లింప్స్ విడుదల చేయగా..

డార్లింగ్ ప్రభాస్ , దీపికా పడుకొణే హీరో హీరోయిన్లుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ గ్లింప్స్ విడుదల చేయగా..

కల్కి నుండి అశ్వత్థామ గ్లింప్స్ రిలీజ్.. ఇవి గమనించారా..?

యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది కల్కి 2898 AD. 50 ఏళ్లుగా నిర్మాణ రంగంలో కొనసాగుతున్న అతి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్ చిత్రంగా కల్కిని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్స్ దీపికా పడుకొనే, దిశా పటానీ, కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తొలుత ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జూన్ 20న మూవీ రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో చిత్రయూనిట్ ఉందని నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే కల్కిపై అప్ డేట్ ఇచ్చింది. కాస్త ఆలస్యమైనా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ రివీల్ చేసింది. అందులో ఓ పిల్లాడు.. ఓ గుహలో ధ్యానంలో ఉన్న వ్యక్తిని ఐయామ్ రాయ..‘నీ పేరేంటి? నీతో ఏ భాషలో మాట్లాడాలి. జనరేషన్ గ్యాప్ అనుకుంటా.. మరీ నువ్వు చనిపోవాలా? ఇది టెంపులా, నువ్వు భగవంతుడా’ అని అనేక భాషల్లో ప్రశ్నిస్తాడు. ‘అంతిమ యుద్దానికి సమయం ఆసన్నమైంది. ద్వాపర యుగం నుండి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను. ద్రోణాచార్య తనయుడ్ని.. నా పేరు అశ్వత్థామ ’ అంటూ గ్లింప్స్‌లో బిగ్ బీతో డైలాగ్స్ చెప్పారు.

ఈ చిన్న గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించింది. ఏఐ టెక్నాలజీ వాడి.. యంగ్ లుక్‌లో కూడా అమితాబ్ చూపించారని తెలుస్తోంది. ఇందులో అమితాబ్ పాత్ర ఒంటి నిండా బట్ట చుట్టుకుని, కేవలం కళ్లు మాత్రమే కనిపిస్తుంటాయి. అంతేకాదు.. అందులో యుక్త వయస్సులో ఉన్నప్పుడు అతడి మూడో కన్నుగా చింతా మణి కనిపిస్తుంది. ఆ జ్ఞాన మణి.. విరిగిపోయి కనిపిస్తుంది. మళ్లీ అది ధరించి యుద్దానికి సిద్ధం అవుతున్న అశ్వత్థామను చూపించారు. అయితే ఇంతకు ఆ అశ్వత్థామ ఎవరు.. కల్కికి ఆయనకు ఏంటీ సంబంధం చూద్దాం. ద్వాపర యుగంలో పాండవులకు, కౌరవులకు ఓ గురువు ఉంటాడు. ఆయనే ద్రోణాచార్యుడు. అతడి కుమారుడే అశ్వత్థామ. 64 కళల్లో ప్రావీణ్యుడైన అతడు కౌరవుల తరుఫున పాండవులపై యుద్దం చేస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థామ సజీవుడిగా ఉంటాడు. అతడు చిరంజీవి. ఈ భూమిపై ఏడుగురు చిరంజీవులుగా మిగిలి ఉన్నారు. వారిలో అశ్వత్థామ ఒకరు.

కురుక్షేత్ర యుద్దం ముగిశాక.. అశ్వత్థామ చేసిన చిన్న పని వల్ల కృష్ణుడు శాపానికి గురతాడు. ప్రపంచం అంతం అయ్యే వరకు అశ్వత్ధామను అమరుడివా జీవించాలని శపిస్తాడు .రక్తం, చీము కారుతూ నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని, ఏకాకివై కొండ, కోనల్లో అలమటిస్తూ ఉంటామని, ప్రతి క్షణం మృత్యువు కోసం పరితపిస్తూ ఉంటావని శపించడంతో ఆయన చిరంజీవిగా మారతాడు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగానే ఈ కల్కి కూడా ఉండబోతుంది. కల్కి అనేది కలియుగం. ఇది ప్రపంచం అంతానికి నాంది అని చాలా పురాణాలు చెబుతున్నాయి. ఈ యుగంలోనే కల్కి అవతరించి.. ధర్మరక్షణ, దుష్ట శిక్షణ చేస్తాడని అంటారు. ఏడుగురు చిరంజీవుల్లో నలుగురు కల్కి ధర్మ సంస్థాపనకు సాయం చేస్తారని ఉంది. అందులో అశ్వత్థామ కూడా ఒకరు. ఇలా కల్కికి, అశ్వత్థామకు ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి