iDreamPost

‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? మారినా.. ఫ్యాన్స్ కు నో టెన్షన్

తాజాగా మరోసారి దేవర రిలీజ్ డేట్ మారినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈసారి డేట్ మారినా.. ఫ్యాన్స్ కు నో టెన్షన్. ఎందుకంటే?

తాజాగా మరోసారి దేవర రిలీజ్ డేట్ మారినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈసారి డేట్ మారినా.. ఫ్యాన్స్ కు నో టెన్షన్. ఎందుకంటే?

‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? మారినా.. ఫ్యాన్స్ కు నో టెన్షన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం పార్ట్ 1 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక దేవర రిలీజ్ డేట్ విషయంలో ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓసారి విడుదల తేదీని మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రిలీజ్ డేట్ మారినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈసారి డేట్ మారినా.. ఫ్యాన్స్ కు నో టెన్షన్. ఎందుకంటే?

‘దేవర’.. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం. రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని టాక్. ప్రస్తుతం గోవాలో యాక్షన్ సన్నివేశాలు షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ మూవీని తొలుత ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో.. విడుదల తేదీని దసరాకు మార్చారు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవరను విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. తాజాగా ఈ డేట్ ను కూడా మార్చాలని మూవీ టీమ్ భావిస్తోందట. అయితే ఈసారి డేట్ వెనక్కి కాదు.. ముందుకే జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా దేవర మూవీ సెప్టెంబర్ 27కి ప్రిపోన్ అవుతోందన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. నిజానికి సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ రావాల్సింది. కానీ అనుకోని సమస్యల కారణంగా ఆ చిత్రం వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. దీంతో ముందుగా అనుకున్న అక్టోబర్ 10న కాకుండా సెప్టెంబర్ 27న దేవర చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రిలీజ్ డేట్ ముందుకు జరగడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి