iDreamPost

డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? 1,42,400 జీతంతో 17 వేలకు పైగా జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో 17 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటఫికేషన్ రిలీజ్ అయ్యింది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో 17 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటఫికేషన్ రిలీజ్ అయ్యింది.

డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? 1,42,400 జీతంతో 17 వేలకు పైగా జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. స్థాఫ్ సెలక్షన్ కమిషన్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఏకంగా 17 వేలకు పైగా జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న వారు జులై 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతలు కలిగి ఉండాలి. 18-45 ఏళ్ల వయసును కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య:

  • 17,727

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • అసిస్టెంట్
  • ఇన్‌స్పెక్టర్ – (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)
  • ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
  • ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
  • అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ)
  • ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)
  • ఇన్‌స్పెక్టర్ – ఇన్‌కమ్ ట్యాక్స్
  • అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్
  • ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (సీబీఐసీ)
  • రిసెర్చ్ అసిస్టెంట్ (ఎన్ హెచ్ఆర్సీ)
  • డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎన్ఐఏ)
  • సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)
  • జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)
  • స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్)
  • ఆడిటర్ (కాగ్, సీజీడీఏ)
  • అకౌంటెంట్ (కాగ్, సీజీఏ)
  • సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
  • జూనియర్ అకౌంటెంట్ (సీజీసీఏ)
  • పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
  • అప్పర్ డివిజన్ క్లర్క్
  • ట్యాక్స్ అసిస్టెంట్

అర్హత:

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.

వయోపరిమితి:

  • 01.08.2024 నాటికి కొన్ని పోస్టులను అనుసరించి 18-32 సంవత్సరాలు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • టైర్-1, టైర్-2 రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

జీతం:

  • ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనం.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 24-06-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 24-07-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి