iDreamPost

Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..5348 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

నిరుద్యోగులు ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నిరుద్యోగులు ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..5348 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

ప్రతి ఒక్కరికి జీవితంలో ఓ లక్ష్యం ఉంటుంది. చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల ఉంటుంది. సర్కారీ కొలువు కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అలానే కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల నుంచి ఉద్యోగాలకు సంబంధించి వచ్చే సమాచారం కోసం ఎంతగానే ఎదురు చూస్తుంటారు. ఈక్రమంలోనే ప్రభుత్వాలు కూడా తరచూ ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ…నిరుద్యోగులకు శుభవార్త చెబుతుంటాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ ఉద్యాలు ఏమిటో, ఆ వివరాలు తెలుసుకుందాం..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత నిరుద్యోగుల విషయంలో తరచూ ఏదో ఒక శుభవార్త వినిపిస్తోంది. ఇటీవలే వరుసగా గ్రూప్స్ కు సంబంధించిన పోస్టులను, అలానే డీఎస్సీకి సంబంధించిన నోటిఫికిషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అలానే ఇటీవలే పలు శాఖలో ఉద్యోగాలు పొందిన వారికి నియమాక పత్రాలను సైతం సీఎం  రేవంత్ రెడ్డి అందించారు. తాజాగా నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య, ఆరోగ్య శాఖ లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి కీలక సమాచారాన్ని విడుదల చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలోని 5348 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

మార్చి 16వ తేదీన ఆర్థిక శాఖ ఈ పోస్టులకు ఉత్తర్వూలు జారీ చేసింది.ఇక 5348 పోస్టుల భర్తీలో భాగంగా ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు. ఇదే సమయంలో ఎంఎన్ జే  క్యాన్సర్ ఆసుపత్రిలో సైతం ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి కూడా తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా ఉపేసింది. వైద్య, ఆరోగ్యశాఖ సర్వీసుల బోర్డు ద్వార ఈ ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది సమాచారం. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం వెల్లడించనుంది. అర్హులైన వాళ్ళు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. మొత్తంగా 5348 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి