iDreamPost

జియో ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్స్.. ఇవి ఉంటే చాలు

  • Published Dec 01, 2023 | 4:17 PMUpdated Dec 02, 2023 | 12:34 PM

నేటి కాలంలో లోన్ కావాలంటే చాలు.. మన ఇంటి వద్దకే వచ్చి అందించే సంస్థలు, యాప్ లు కొకొల్లలు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి జియో ఫైనాన్స్ కూడా చేరింది. ఆ వివరాలు..

నేటి కాలంలో లోన్ కావాలంటే చాలు.. మన ఇంటి వద్దకే వచ్చి అందించే సంస్థలు, యాప్ లు కొకొల్లలు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి జియో ఫైనాన్స్ కూడా చేరింది. ఆ వివరాలు..

  • Published Dec 01, 2023 | 4:17 PMUpdated Dec 02, 2023 | 12:34 PM
జియో ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్స్.. ఇవి ఉంటే చాలు

ఒకప్పుడు లోన్ అంటే కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఇచ్చేవి. దానికి కూడా సవాలక్ష కండీషన్లు పెట్టేవి. ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంక్ లు, ఫైనాన్స్ కంపెనీలు కూడా లోన్లు ఇవ్వడం ప్రారంభించాయి. ప్రస్తుతం మార్కెట్ లో మన ప్రతి అవసరానికి తగ్గట్టుగా లోన్ ఇచ్చే కంపెనీలు, సంస్థలు, యాప్ లు అనేకం ఉన్నాయి. ఒక్క ఫోన్ చేస్తే చాలు.. లోన్ ఇవ్వడానికి మన ఇంటి దగ్గరకే వస్తారు. తాజాగా వీటి సరసన మరో కంపెనీ చేరింది. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన జియో ఫైనాన్స్‌ కూడా పర్సనల్ లోన్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆ వివరాలు..

జియో ఫైనాన్స్ పర్సనల్ లోన్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా తొలుత పర్సనల్‌ లోన్స్, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ లోన్స్, మర్చంట్‌ ట్రేడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీని ఆరంభించింది. జియో ఫైనాన్స్, మై జియో మొబైల్‌ అప్లికేషన్స్‌ ద్వారా వేతన జీవులు, స్వయం ఉపాధి పొందే వారికి డిజిటల్‌ పర్సనల్‌ లోన్స్‌ ఆఫర్‌ చేస్తోంది. ఇక లోన్ పొందడం కూడా ఎంతో తేలిక.

జియో ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్ పొందాలంటే.. పాన్‌ కార్డ్, ఆధార్‌ కార్డ్, ఆధార్‌ నంబర్ తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ ఉంటే చాలు.. ఈజీగా లోన్ పొందవచ్చు. దీని కింద వేతన జీవులు అందునా 23-58 సవంత్సరాల మధ్య వయసు ఉన్న వారు.. 3 లక్షల రూపాయల వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశం ఏంది.

అలానే కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ లోన్స్‌ కింద ఖరీదైన మొబైల్‌ ఫోన్లు, ఏసీలు, కెమెరా కొనుగోళ్లకు రుణాలను అందిస్తోంది. మర్చంట్‌ వెబ్‌ సైట్లపై నోకాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ కింద ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. వేతన జీవులు, ఇతరులకు కూడా ఈలోన్లను అందిస్తుంది.. 21-60 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ లోన్లకు అప్లై చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా జియో ఫైనాన్స్ ఒక ప్రకటన చేసింది. ‘‘జియో ఫైనాన్స్‌ కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రుణాలను అందిస్తోంది. తయారీదారులు, ఓఈఎంలు లేదా డీలర్లు ఈ రుణాలపై వడ్డీని భరిస్తారు. దీంతో వినయోగదారులు.. నో కాస్ట్‌ ఈఎంఐ ప్రయోజనాన్ని పొందొచ్చు. కాకపోతే కస్టమర్లు ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది’’అని పేర్కొంది.

కేవలం పర్సనల్, కన్జ్యూమర్ లోన్ లు మాత్రమే కాక.. ఇన్వెంటరీ కొనుగోళ్లకూ రుణాలు, వ్యాపారస్థులకు కూడా లోన్లు ఇవ్వనుంది. అలానే తన ప్లాట్ ఫామ్ మీద నమోదైన వర్తకులకు అన్‌ సెక్యూర్డ్‌ మర్చంట్‌ ట్రేడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీని అందించనుంది. జియో ఫైనాన్షియల్‌ రిలయన్స్‌ నుంచి విడిపోయి ఎక్స్చేంజ్లో లిస్టయిన సంగతి తెలిసిందే. రుణాలు ఇవ్వడమే కాక.. త్వరలోనే ఈ సంస్థ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్, మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలను సైతం త్వరలోనే అందించనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి