iDreamPost

జిగర్ తండ డబుల్ ఎక్స్ OTT డేట్ ఫిక్స్! ఎప్పటి నుంచంటే..

Jigarthanda Double X OTT Release Date: రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన జింగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ నవంబర్ 10న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అక్కడ మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.

Jigarthanda Double X OTT Release Date: రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన జింగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ నవంబర్ 10న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అక్కడ మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.

జిగర్ తండ డబుల్ ఎక్స్ OTT డేట్ ఫిక్స్! ఎప్పటి నుంచంటే..

కోలీవుడ్ స్టార్లు రాఘవ లారెన్స్, ఆర్జే సూర్య ప్రధాన పాత్ర్లో నటించిన చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్.  ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జిగర్ తండ  మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది.  ఈ సినిమా నవంబర్ 10 తెలుగు, తమిళ భాషల్లో రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్లే రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. మరి ఇప్పటికి థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే డేట్ ఫిక్స్ అయింది.

కోలీవుడ్ లో జిగర్ తండ అనే చిత్రం 2014లో వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ సినిమా తెలుగు గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులోనూ గద్దలకొండ గణేష్ సినిమా సక్సెస్ అయింది. ఇక దాదాపు 9 ఏళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు. డైరెక్టర్, కొరియోగ్రాఫర్, యాక్టర్ రాఘవలారెన్స్ లారెన్స్, డైరెక్టర్, యాక్టర్ ఎస్ జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జిగర్ తండ డబుల్ ఎక్స్ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. తాజాగా ఓటీటీలో స్ట్రీమి అయ్యేందుకు మూహుర్తం ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో అయితే ఈ డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటన చేశారు. అంటే తెలుగుక, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 8న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అంతే కాకుండా మరో ఆసక్తికరమైన విషయం ఒకటి వెల్లడైంది. అతి త్వరలోనే ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా ఈ సినిమాని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూసేద్దాం అనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. ఈ సినిమాలో లారెన్స్ , సూర్య నటనకు వందశాతం మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు దసరా సినిమాకు మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయణన్ నే.. ఈ సినిమాకు సంగీతం అందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి