iDreamPost
android-app
ios-app

‘జవాన్​’ మూవీ సక్సెస్.. షారుక్ ఖాన్​పై రాజమౌళి ప్రశంసలు!

  • Author singhj Updated - 10:10 PM, Fri - 8 September 23
  • Author singhj Updated - 10:10 PM, Fri - 8 September 23
‘జవాన్​’ మూవీ సక్సెస్.. షారుక్ ఖాన్​పై రాజమౌళి ప్రశంసలు!

బాలీవుడ్ కింగ్​ ఖాన్ షారుక్ మళ్లీ ఫామ్​లోకి వచ్చేశారు. వరుస పరాజయాలతో కొన్నేళ్ల పాటు సతమతమైన ఈ స్టార్ హీరో.. మళ్లీ సక్సెస్ ట్రాక్ అందుకున్నారు. ‘పఠాన్’తో రూ.1,000 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. తన సత్తా ఏమాత్రం తగ్గలేదని ఆయన నిరూపించారు. దీంతో షారుక్ తర్వాతి చిత్రంపై ప్రేక్షకులు అమితాసక్తి ఏర్పడింది. నెక్స్ట్ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జట్టుకట్టారు షారుక్. వీరి కాంబోలో రూపొందిన ‘జవాన్’ మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా బహు భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. ఈ మూవీపై మంచి బజ్ ఉన్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం ఊహించిన దానికంటే భారీగా వచ్చాయి.

‘జవాన్’ మూవీ రిలీజైన ఫస్ట్ డేనే రూ.129 కోట్లు వసూలు చేసింది. లాంగ్ రన్​లో ఈ మూవీ రూ.1,000 కోట్ల మార్క్​ను అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ‘జవాన్​’లో కింగ్​ ఖాన్​ను నెవర్ బిఫోర్ ఊర మాస్ అవతార్​లో చూసిన ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ‘జవాన్’ సినిమాపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ సినిమాను చూశానని.. షారుక్ ఖాన్​ను బాక్సాఫీస్ బాద్​షా అని అనడానికి ఇదే కారణమన్నారు జక్కన్న.

‘జవాన్​’తో ఉత్తరాదిలోనూ విజయదుందుభిని మోగించిన డైరెక్టర్ అట్లీకి రాజమౌళి అభినందనలు తెలిపారు. ఇంత అద్భుతమైన సక్సెస్​ను అందుకున్న మూవీ యూనిట్​కు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. అయితే రాజమౌళి ట్వీట్​కు షారుక్ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు. జక్కన్నకు థ్యాంక్స్ చెప్పిన కింగ్ ఖాన్.. దర్శకధీరుడి నుంచి చాలా నేర్చుకుంటున్నామని అన్నారు. దయచేసి సినిమా చూడాలని, ఆ తర్వాత తనకు కాల్ చేసి మాస్ హీరోగా తాను చేయగలిగానో లేదో చెప్పాలని ట్వీట్ చేశారు షారుక్. నిజానికి ‘జవాన్​’ను జక్కన్న చూసినప్పటికీ షారుక్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ రాజమౌళి ముందు చేసిన ట్వీట్ చూసుంటే షారుక్ రిప్లయ్ మరోలా ఉండేదేమోనని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇదీ చదవండి: OTTలోకి ఆలియా హిట్ మూవీ.. కానీ ఈ చిత్రం చూడాలంటే..?

marsbahis girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet girişjojobet giriş