iDreamPost
android-app
ios-app

Janhvi Kapoor: అది ఆయనకు మాత్రమే సొంతం.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్

  • Published May 14, 2024 | 8:05 PMUpdated May 14, 2024 | 8:05 PM

జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజగా ఆమె నటించిన ఓ సినిమా కోసం ఐపీఎల్ ను బాగా వాడుకుంటుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజగా ఆమె నటించిన ఓ సినిమా కోసం ఐపీఎల్ ను బాగా వాడుకుంటుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  • Published May 14, 2024 | 8:05 PMUpdated May 14, 2024 | 8:05 PM
Janhvi Kapoor: అది ఆయనకు మాత్రమే సొంతం.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్

సినీ నటులన్న తర్వాత అటు ఇండస్ట్రీలో కానీ, ఇటు బయట కానీ వారికంటూ ప్రత్యేకమైన అభిమాన నటి నటులు ఉంటారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడైనా వారికి విరుద్ధంగా ఏమైనా జరిగితే అవి కాస్త చర్చలకు దారి తీస్తాయి. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ పైన కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జాన్వీ తన కొత్త సినిమాల కోసం ఐపీఎల్ ను బాగా వాడుకుంటుందని టాక్ వినిపిస్తుంది. మహి అంటూ ఎల్లో జెర్సీలో 6 నంబర్ లో ఐపీఎల్ మ్యాచ్ లో కనిపిస్తుంది. మహి జెస్సి మాత్రం 7. మరి జాన్వీ ఎందుకు ఇలా చేస్తుంది అనే డిస్కషన్స్ జరిగాయి. అయితే ఆ విషయం గురించి జాన్వీ కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం జాన్వీ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా మే 31 న రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను కాస్త కొత్తగా చేస్తుంది జాన్వీ. మహి అంటూ 6 వ నెంబర్ జెర్సీతో కనిపిస్తుంది. పైగా ఐపీఎల్ మ్యాచ్స్ జరిగే చోటుకి ఈ జెర్సీని వేసుకుని వెళ్తుంది. ఆ జెర్సీ పై మహి అని ఉండడం .. నెంబర్ ఏమో 6 అని ఉండడంతో అందరికి.. సందేహాలు మొదలయ్యాయి. దీనితో సోషల్ మీడియా లో ఆమెపైన ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఇక ఆ విషయాలపై తాజాగా జాన్వీ స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. తానూ కేవలం మూవీ ప్రమోషన్స్ కోసమే ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. దానితో పాటు ఇంకా జాన్వీ ఏం చెప్పిందంటే..

“మహేంద్ర సింగ్ ధోని లెజెండ్ , ఆయన అంటే అందరికీ గౌరవం.. ఏడో నెంబర్ జెర్సీ ఆయనకు మాత్రమే ఉండాలి.. అది ఆయనకే సొంతం , ఇంకెవ్వరికీ సెట్ కాదు , అందుకే ఆయన మీదున్న గౌరవంతో మేం ఇలా ఆరో నెంబర్ జెర్సీని సినిమాలో పెట్టుకున్నాం”. అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్ . దీనితో అభిమానులు ప్రశ్నలకు తెర పడింది. ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే ఆమె తన సినిమాలతో ప్రేక్షకులలో మంచి పేరు సంపాదించుకుంటుందని చెప్పి తీరాలి, ఇక ఇప్పుడు రాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి