iDreamPost

Rohit Sharma: రోహిత్ కొత్త టార్గెట్.. హార్దిక్ సహా ఎవ్వరికీ తెలియకుండా సెట్ చేశాడు!

  • Published Apr 12, 2024 | 8:05 PMUpdated Apr 12, 2024 | 8:05 PM

ఈసారి ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్​లతో ఎంఐకి మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. అయితే హిట్​మ్యాన్​కు ఓ టార్గెట్ ఉందని ఎవరికీ తెలియదు.

ఈసారి ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్​లతో ఎంఐకి మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. అయితే హిట్​మ్యాన్​కు ఓ టార్గెట్ ఉందని ఎవరికీ తెలియదు.

  • Published Apr 12, 2024 | 8:05 PMUpdated Apr 12, 2024 | 8:05 PM
Rohit Sharma: రోహిత్ కొత్త టార్గెట్.. హార్దిక్ సహా ఎవ్వరికీ తెలియకుండా సెట్ చేశాడు!

ఈసారి ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్​లతో ఎంఐకి మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక దాంట్లో మాత్రమే అతను ఫెయిలయ్యాడు. మిగతా నాలుగింట్లో చెలరేగిపోయాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్​కు దిగుతున్నాడు రోహిత్. బౌలర్ ఎవరు? పిచ్ ఎలా బిహేవ్ చేస్తోంది? అనేది పట్టించుకోకుండా వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్​లోకి పంపిస్తున్నాడు. టెక్నిక్​తో పాటు కండబలంతో బలంగా షాట్లు బాదుతున్నాడు హిట్​మ్యాన్​. దీంతో అతడ్ని ఎలా ఆపాలో తెలియక అపోజిషన్ టీమ్ బౌలర్లు గుడ్లు తేలేస్తున్నారు. రోహిత్ పెర్ఫార్మెన్స్ మీద ముంబై జట్టుతో పాటు అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే హిట్​మ్యాన్​కు ఓ కొత్త టార్గెట్ ఉందని ఎవరికీ తెలియదు.

ఈ సీజన్​లో హ్యాట్రిక్ ఓటములతో డీలాపడ్డ ముంబై దాని నుంచి తేరుకొని వరుసగా రెండు విజయాలు సాధించింది. ఈ రెండు మ్యాచుల్లోనూ రోహిత్ రాణించాడు. ఇలా అతడు వరుసగా మంచి స్టార్ట్స్ అందిస్తుండటంతో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు ముంబై మేనేజ్​మెంట్ హ్యాపీగా ఉంది. టీమ్ గెలుపులో అతడి కాంట్రిబ్యూషన్స్​ కీలకంగా మారాయి. అటు బ్యాట్​తో విజృంభిస్తూనే బౌలింగ్ టైమ్​లో హార్దిక్​కు సూచనలు ఇస్తూ కీలకపాత్ర పోషిస్తున్నాడు రోహిత్. ఫీల్డింగ్ పొజిషన్స్, బౌలింగ్ ఛేంజెస్ విషయంలో ఏ టైమ్​కు ఎలా వ్యవహరించాలనేది పాండ్యాకు నేర్పుతూ ముంబైకి ఆయువుపట్టుగా మారాడు. అయితే రోహిత్​ ఓ టార్గెట్​తో ఆడుతున్నాడనేది ఎవరికీ తెలియదు. హిట్​మ్యాన్ ఇప్పుడు పీక్ ఫామ్​లో ఉన్నాడు. టీ20 ఫార్మాట్​లో గత ఆరు ఇన్నింగ్స్​ల్లో అతడి స్కోర్లు.. 121 నాటౌట్, 43, 26, 0, 49, 38గా ఉన్నాయి. అందరూ ముంబై ఇండియన్స్​కు కప్పు అందించాలనే కసితోనే అతడు ఇలా ఆడుతున్నాడని అనుకుంటున్నారు. కానీ హిట్​మ్యాన్​కు సెపరేట్ మిషన్ ఉంది.

Rohith New Target

ముంబై యాజమాన్యం, కొత్త కెప్టెన్ హార్దిక్ సహా ఎవ్వరికీ రోహిత్ నయా టార్గెట్ గురించి తెలియదు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్​ ఫైనల్​లో ఓడిన బాధ ఇంకా అతడ్ని వెంటాడుతోంది. ఆ పెయిన్​ నుంచి బయటపడాలంటే ఈ ఏడాది జూన్​లో జరిగే టీ20 వరల్డ్ కప్​ను నెగ్గడమే మార్గం. అందుకే ఇంత జోరు మీద ఉన్నాడు హిట్​మ్యాన్. ఆల్రెడీ ముంబైకి 5 కప్పులు అందించాడతను. కాబట్టి ఐపీఎల్ టైటిల్ అతడికి పెద్ద మ్యాటర్ కాదు. కెరీర్ ఆఖర్లో ఉన్నాడు కాబట్టి వరల్డ్ కప్ అందుకోవాలనే డ్రీమ్​తో మరింత కసితో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రపంచ కప్​లోనూ ఇదే ఫామ్​ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. మరి.. రోహిత్ కొత్త టార్గెట్​ను అందుకుంటాడని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి