iDreamPost

కావ్య మారన్ పక్కన ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? అస్సలు నమ్మలేరు!

  • Published Apr 12, 2024 | 7:18 PMUpdated Apr 12, 2024 | 7:18 PM

ఎప్పటిలాగే ఈసారి కూడా సన్​రైజర్స్ హైదరాబాద్ మ్యాచులకు అటెండు అవుతున్నారు కావ్య మారన్. అయితే ఈసారి ఆమెతో పాటు పక్కనే ఉన్న మరో బ్యూటీ కూడా వైరల్ అవుతున్నారు. ఆమె గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఎప్పటిలాగే ఈసారి కూడా సన్​రైజర్స్ హైదరాబాద్ మ్యాచులకు అటెండు అవుతున్నారు కావ్య మారన్. అయితే ఈసారి ఆమెతో పాటు పక్కనే ఉన్న మరో బ్యూటీ కూడా వైరల్ అవుతున్నారు. ఆమె గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

  • Published Apr 12, 2024 | 7:18 PMUpdated Apr 12, 2024 | 7:18 PM
కావ్య మారన్ పక్కన ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? అస్సలు నమ్మలేరు!

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి మంచి ఊపు మీద ఉంది. ఐపీఎల్-2024లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో మూడింట నెగ్గి పాయింట్స్ టేబుల్​లో ఐదో ప్లేస్​లో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఒకదాంట్లో స్మాల్ మార్జిన్​తో ఓడిపోయింది. ఎప్పుడూ బౌలింగ్ బలంతో బరిలోకి దిగే ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి బ్యాటింగ్​లోనూ దుమ్మురేపుతోంది. దాదాపుగా ప్రతి మ్యాచ్​లోనూ కనీసం 180 పరుగులు చేస్తోంది. మూడు సార్లు 200కు పైగా పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్​ మీదనైతే ఏకంగా 277 పరుగులు చేసింది. క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో ఒక టీమ్ చేసిన హయ్యెస్ట్ స్కోరు ఇదే కావడం విశేషం. ఎస్ఆర్​హెచ్ బ్యాటింగ్​లో ఓపెనర్లు హెడ్, అభిషేక్​ శర్మతో పాటు హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్​లు కీలకం అవుతున్నారు. కొత్త కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ఊపు మీదున్నాడు.

ఎస్ఆర్​హెచ్ వరుస విజయాలు సాధిస్తుండటంతో టీమ్ ఓనర్ కావ్య మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జట్టు మ్యాచులకు హాజరవుతూ ఆటగాళ్లలో మరింత జోష్ నింపుతున్నారు. దీంతో సన్​రైజర్స్ మ్యాచుల టైమ్​లో ఆమె మీద కెమెరాలు ఫోకస్ చేస్తున్నాయి. అయితే ఈసారి కావ్య పాపతో పాటు ఆమె పక్కన క్యూట్ స్మైల్​తో మెరిసిపోయిన ఓ బ్యూటీ కూడా కెమెరాల కంట పడింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కావ్య పాపనే అందంలో డామినేట్ చేస్తుండటంతో అసలు ఎవరీమె? అని  తెలుసుకునేందుకు ప్రయత్నించారు అభిమానులు. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సోదరి కావడం గమనార్హం.

అభిషేక్ శర్మ సిస్టర్ కోమల్ శర్మ ఈసారి ఐపీఎల్​లో స్పెషల్ అట్రాక్షన్​గా మారారు. ఎస్ఆర్​హెచ్ మ్యాచులు ఎక్కడ జరిగినా ఆమె స్టేడియంలో వాలిపోతున్నారు. ఈ క్రమంలో కావ్య మారన్​తో కలసి ఫొటోలు కూడా దిగారు. అందులో వాళ్లిద్దరూ నవ్వులు చిందిస్తూ కనిపించారు. దీన్ని చూసిన నెటిజన్స్ ఎవరీమె అంటూ వెతకడం మొదలుపెట్టారు. అభిషేక్ సోదరి అని తెలిసి కామెంట్స్ చేస్తున్నారు. ఆమెది హీరోయిన్లకు తగ్గని అందం అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక, అభిషేక్ శర్మ ఈసారి ఐపీఎల్​లో దుమ్మురేపుతున్నాడు. ధనాధన్ స్టార్స్ ఇస్తూ ఎస్​ఆర్​హెచ్​ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆడిన 5 మ్యాచుల్లో 177 పరుగులు చేశాడు. అతడి స్ట్రయిక్ రేట్ 208గా ఉంది. లీడింగ్ రన్ స్కోరర్​గా ఉన్న విరాట్ కోహ్లీ (141) కూడా ఇంత స్ట్రయిక్ రేట్ లేదు. దీన్ని బట్టే అభిషేక్ బౌలర్లను ఎంతగా ఊచకోత కోస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి