iDreamPost

కెప్టెన్సీ పోవడం వల్ల రోహిత్​కే ప్లస్సు.. ఈ మార్పులే దానికి ప్రూఫ్!

  • Published Mar 26, 2024 | 3:56 PMUpdated Mar 26, 2024 | 3:56 PM

ఐపీఎల్-2024లో రోహిత్ శర్మ కేవలం ప్లేయర్​గానే ఆడుతున్న విషయం తెలిసిందే. సీజన్ మొదలవడానికి చాలా ముందే అతడ్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించారు.

ఐపీఎల్-2024లో రోహిత్ శర్మ కేవలం ప్లేయర్​గానే ఆడుతున్న విషయం తెలిసిందే. సీజన్ మొదలవడానికి చాలా ముందే అతడ్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించారు.

  • Published Mar 26, 2024 | 3:56 PMUpdated Mar 26, 2024 | 3:56 PM
కెప్టెన్సీ పోవడం వల్ల రోహిత్​కే ప్లస్సు.. ఈ మార్పులే దానికి ప్రూఫ్!

ఐపీఎల్-2024 చాలా కొత్త విషయాలకు వేదికగా మారింది. లెజెండరీ ప్లేయర్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ సీజన్​లో కేవలం బ్యాటర్స్​గానే బరిలోకి దిగడం అందులో ఒకటి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి కోహ్లీ ఎప్పుడో తప్పుకున్నాడు. నయా సీజన్ మొదలవడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు సారథ్య బాధ్యతల నుంచి ధోని వైదొలిగాడు. ఇక మీదట తనకు బదులుగా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్​గా టీమ్​ను ముందుకు నడిపిస్తాడని మాహీ ప్రకటించాడు. అయితే కోహ్లీ, ధోని కంటే ఈ విషయంలో రోహిత్​ది కాస్త డిఫరెంట్ స్టోరీ. టీమ్​కు 5 ట్రోఫీలు అందించిన హిట్​మ్యాన్​ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తీసేసింది ముంబై యాజమాన్యం. ఇది అతడి ఫ్యాన్స్​తో పాటు టీమిండియా అభిమానులను కూడా ఎంతగానో బాధించింది. అయితే కెప్టెన్సీ పోవడం వల్ల రోహిత్​కే ప్లస్సు అయింది.

ఏడాది మొత్తం టీమిండియాకు ఆడుతూ ఒక బ్యాటర్​గా, కెప్టెన్​గా ఎంతో అలసిపోయేవాడు రోహిత్. ఐపీఎల్​లో కూడా 45 రోజల పాటు ముంబై ఇండియన్స్​కు సారథ్యం వహిస్తూ, అలాగే బ్యాట్స్​మన్​గా ఎంతో బిజీ అయిపోయేవాడు. మ్యాచుల టైమ్​లో ఎప్పుడూ సీరియస్​గా, అప్పుడప్పుడూ ఫ్రస్ట్రేషన్​తో కనిపించేవాడు హిట్​మ్యాన్. గెలవాలనే ప్రెజర్ వల్ల కావొచ్చు రోహిత్ ముఖంలో నవ్వే కనిపించేది కాదు. టైట్ షెడ్యూల్​తో శారీరకంగానే కాదు మానసికంగా కూడా అలసిపోయేవాడు. కానీ కెప్టెన్సీ భారం పోవడంతో అతడిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ముంబై ప్రాక్టీస్ సెషన్స్​లో తన పనేదో తాను అన్నట్లు రోహిత్ ఒక్కడే బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యాతో కెప్టెన్సీ వివాదం నేపథ్యంలో టీమ్ ప్లేయర్లతో పెద్దగా కలవడం లేదు హిట్​మ్యాన్. జస్​ప్రీత్ బుమ్రా లాంటి ఒకరిద్దరు సీనియర్లతో మాత్రమే ఉంటున్నాడు.

గుజరాత్ టైటాన్స్​తో జరిగిన ఫస్ట్ మ్యాచ్​లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయాల్సిందిగా రోహిత్​ను ఆదేశించాడు కొత్త కెప్టెన్ హార్దిక్. తనను వెళ్లమంటున్నావా? అంటూ మొదట్లో కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసిన హిట్​మ్యాన్ ఆ తర్వాత కూల్​గా ఓకే చెప్పి ఫీల్డింగ్ చేశాడు. హార్దిక్​ అలా అన్నప్పుడు రోహిత్ నో చెబితే కాంట్రవర్సీ అయ్యేది. కానీ వివాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న హిట్​మ్యాన్ కూల్​గా చెప్పిన పని చేసుకుపోయాడు. అలాగే కెప్టెన్సీ బర్డెన్ పోవడంతో బ్యాట్​తో కూడా చెలరేగిపోయాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. స్వేచ్ఛగా షాట్లు కొడుతూ డేంజరస్​గా కనిపించాడు.

రీసెంట్​గా హోలీ సెలబ్రేషన్స్​తో భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో కలసి ఫుల్ ఫన్ మోడ్​లో కనిపించాడు రోహిత్. రంగులు చల్లుకుంటూ చిల్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో హిట్​మ్యాన్​ను ఇలా నవ్వుతూ, రిలాక్స్​డ్​గా చూడటం ఇదే తొలిసారి అని అతడి అభిమానులు కూడా అంటున్నారు. ఎంఐ కెప్టెన్సీ నుంచి తీసేయడం హిట్​మ్యాన్​కు బిగ్ ప్లస్ అయిందని.. అతడు తిరిగి తనను తాను రీఫ్రెష్ చేసుకోవడానికి ఇది ఎంతో హెల్ప్ అయిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్​లో మీరు కొత్తగా ఇంకేమైనా మార్పులు చూసినట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ధావన్ అరుదైన ఘనత.. IPL చరిత్రలో ఒకే ఒక్కడిగా సరికొత్త రికార్డు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి