iDreamPost

సీనియర్ స్టార్ ప్లేయర్​ను సాగనంపిన CSK.. రిలీజ్డ్ లిస్ట్ ఇదే!

  • Author singhj Published - 06:43 PM, Sun - 26 November 23

వచ్చే సీజన్ కోసం జరుగుతున్న రిటెన్షన్​ డేలో పలువురు కీలక ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ సాగనంపింది. అందులో రూ.16 కోట్ల సీనియర్ స్టార్ ప్లేయర్ కూడా ఉన్నాడు.

వచ్చే సీజన్ కోసం జరుగుతున్న రిటెన్షన్​ డేలో పలువురు కీలక ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ సాగనంపింది. అందులో రూ.16 కోట్ల సీనియర్ స్టార్ ప్లేయర్ కూడా ఉన్నాడు.

  • Author singhj Published - 06:43 PM, Sun - 26 November 23
సీనియర్ స్టార్ ప్లేయర్​ను సాగనంపిన CSK.. రిలీజ్డ్ లిస్ట్ ఇదే!

వరల్డ్ కప్-2023 ముగిసిపోవడంతో ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హంగామా షురూ అయింది. మెగా లీగ్​కు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ప్లేయర్ల రిటెన్షన్/రిలీజ్ రూపంలో మరోమారు వార్తల్లో నిలిచింది ఐపీఎల్. కొన్ని రోజులుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రిటెన్షన్ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాండ్యాను గుజరాత్ వదులుకుంటోందని.. అతడ్ని ముంబై ఇండియన్స్​కు ఇచ్చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. హార్దిక్ కోసం ముంబై టీమ్ ఏకంగా రూ.15 కోట్లు గుజరాత్​కు ఇచ్చేందుకు రెడీ అయిపోయిందని వినిపించింది. అంతేగాక పాండ్యాకు, గుజరాత్ టీమ్​కు తెరచాటున మరికొంత మొత్తాన్ని ఇవ్వనుందని కూడా న్యూస్ వచ్చింది.

హార్దిక్ పాండ్యా తమ టీమ్​లోకి వస్తున్నందుకు అతడికి బిజినెస్ యాడ్స్ రూపంలో అదనంగా భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ రెడీ అయిందని వినిపించింది. కానీ ఇవన్నీ ఒట్టి రూమర్సే అని తేలిపోయింది. తమ జట్టును ఒకసారి గెలిపించి, మరోమారు రన్నరప్​గా నిలిపిన హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రీటెయిన్ చేసుకుంది. దీంతో అతడు ముంబైకి వెళ్తున్నాడనే వార్తలకు ఫుల్​స్టాప్ పడింది. ఇక లీగ్​లో పాపులర్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్​ విషయంలోనూ చాలా మార్పులు జరిగాయి. ఎంతో ఎక్స్​పెక్టేషన్స్​తో రూ.16.2 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న బెన్ స్టోక్స్ గాయం కారణంగా లాస్ట్ సీజన్​లో ఆడలేదు. దీంతో అతడ్ని సాగనంపింది సీఎస్​కే యాజమాన్యం.

స్టోక్స్​తో పాటు మరికొందరు ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసింది. ఆ లిస్టులో డ్వేన్ ప్రిటోరియస్ (రూ.50 లక్షలు), భగత్ వర్మ (రూ.20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతి (రూ.20 లక్షలు) ఉన్నారు. ఆకాశ్ సింగ్ (రూ.20 లక్షలు), కైల్ జెమీసన్ (రూ.1 కోటి), సిసండ మగలా (రూ.50 లక్షలు)​ను కూడా సీఎస్​కే వద్దనుకుంది. అలాగే రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు (రూ.6.7 కోట్లు)ను కూడా ఎల్లో ఆర్మీ విడుదల చేసింది. మోకాలి గాయంతో బాధపడుతున్న చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే సీజన్​లో ఆడతాడా? లేదా? అనే దానిపై ప్రశ్నలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాహీని సీఎస్​కే రిటేయిన్ చేసుకోవడంతో అతడు మరో సీజన్ ఆడటం ఖాయమైపోయింది. మరి.. రూ.16 కోట్ల ఆటగాడు స్టోక్స్ సహా పలువురు కీలక ప్లేయర్లను సీఎస్​కే సాగనంపడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అతడో యూజ్ అండ్ త్రో ప్లేయర్.. పఠాన్ కామెంట్స్ ఆ క్రికెటర్​ను ఉద్దేశించేనా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి