వచ్చే సీజన్ కోసం జరుగుతున్న రిటెన్షన్ డేలో పలువురు కీలక ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ సాగనంపింది. అందులో రూ.16 కోట్ల సీనియర్ స్టార్ ప్లేయర్ కూడా ఉన్నాడు.
వచ్చే సీజన్ కోసం జరుగుతున్న రిటెన్షన్ డేలో పలువురు కీలక ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ సాగనంపింది. అందులో రూ.16 కోట్ల సీనియర్ స్టార్ ప్లేయర్ కూడా ఉన్నాడు.
వరల్డ్ కప్-2023 ముగిసిపోవడంతో ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హంగామా షురూ అయింది. మెగా లీగ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ప్లేయర్ల రిటెన్షన్/రిలీజ్ రూపంలో మరోమారు వార్తల్లో నిలిచింది ఐపీఎల్. కొన్ని రోజులుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రిటెన్షన్ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాండ్యాను గుజరాత్ వదులుకుంటోందని.. అతడ్ని ముంబై ఇండియన్స్‌కు ఇచ్చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. హార్దిక్ కోసం ముంబై టీమ్ ఏకంగా రూ.15 కోట్లు గుజరాత్‌కు ఇచ్చేందుకు రెడీ అయిపోయిందని వినిపించింది. అంతేగాక పాండ్యాకు, గుజరాత్ టీమ్‌కు తెరచాటున మరికొంత మొత్తాన్ని ఇవ్వనుందని కూడా న్యూస్ వచ్చింది.
హార్దిక్ పాండ్యా తమ టీమ్‌లోకి వస్తున్నందుకు అతడికి బిజినెస్ యాడ్స్ రూపంలో అదనంగా భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ రెడీ అయిందని వినిపించింది. కానీ ఇవన్నీ ఒట్టి రూమర్సే అని తేలిపోయింది. తమ జట్టును ఒకసారి గెలిపించి, మరోమారు రన్నరప్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రీటెయిన్ చేసుకుంది. దీంతో అతడు ముంబైకి వెళ్తున్నాడనే వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఇక లీగ్‌లో పాపులర్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ విషయంలోనూ చాలా మార్పులు జరిగాయి. ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో రూ.16.2 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న బెన్ స్టోక్స్ గాయం కారణంగా లాస్ట్ సీజన్లో ఆడలేదు. దీంతో అతడ్ని సాగనంపింది సీఎస్కే యాజమాన్యం.
స్టోక్స్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసింది. ఆ లిస్టులో డ్వేన్ ప్రిటోరియస్ (రూ.50 లక్షలు), భగత్ వర్మ (రూ.20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతి (రూ.20 లక్షలు) ఉన్నారు. ఆకాశ్ సింగ్ (రూ.20 లక్షలు), కైల్ జెమీసన్ (రూ.1 కోటి), సిసండ మగలా (రూ.50 లక్షలు)ను కూడా సీఎస్కే వద్దనుకుంది. అలాగే రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు (రూ.6.7 కోట్లు)ను కూడా ఎల్లో ఆర్మీ విడుదల చేసింది. మోకాలి గాయంతో బాధపడుతున్న చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే సీజన్లో ఆడతాడా? లేదా? అనే దానిపై ప్రశ్నలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాహీని సీఎస్కే రిటేయిన్ చేసుకోవడంతో అతడు మరో సీజన్ ఆడటం ఖాయమైపోయింది. మరి.. రూ.16 కోట్ల ఆటగాడు స్టోక్స్ సహా పలువురు కీలక ప్లేయర్లను సీఎస్కే సాగనంపడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అతడో యూజ్ అండ్ త్రో ప్లేయర్.. పఠాన్ కామెంట్స్ ఆ క్రికెటర్‌ను ఉద్దేశించేనా..?
CSK released Ben Stokes, Dwaine Pretorius, Ambati Rayudu, Sisanda Magala, Kyle Jamieson, Bhagath Varma, Senapati and Akash Singh. pic.twitter.com/XMDJC6QiJP
— Johns. (@CricCrazyJohns) November 26, 2023