iDreamPost

అతడో యూజ్ అండ్ త్రో ప్లేయర్.. పఠాన్ కామెంట్స్ ఆ క్రికెటర్​ను ఉద్దేశించేనా..?

  • Author singhj Published - 05:57 PM, Sun - 26 November 23

టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అతడు ట్వీట్ చేసింది ఆ క్రికెటర్ గురించేనా అనే డిస్కషన్ నడుస్తోంది.

టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అతడు ట్వీట్ చేసింది ఆ క్రికెటర్ గురించేనా అనే డిస్కషన్ నడుస్తోంది.

  • Author singhj Published - 05:57 PM, Sun - 26 November 23
అతడో యూజ్ అండ్ త్రో ప్లేయర్.. పఠాన్ కామెంట్స్ ఆ క్రికెటర్​ను ఉద్దేశించేనా..?

క్రికెట్​లో ఇప్పుడంతా లీగ్​లదే హవా. ఏడాది మొత్తం ప్రపంచంలో ఏదో ఓ చోట ఏదో ఒక లీగ్ జరుగుతూనే ఉంటుంది. మొన్నటి దాకా టీ20 లీగ్స్​ అనుకుంటే.. ఇప్పుడు టీ10 లీగ్స్ కూడా వచ్చేశాయి. ఆ ప్లేయర్, ఈ ప్లేయర్ అనే తేడా లేదు. టీమిండియా లాంటి ఒకట్రెండు జట్లను తప్పిస్తే దాదాపుగా అన్ని దేశాల క్రికెటర్లు ఈ లీగ్స్​లో ఆడుతూ కాసులు వెనకేసుకుంటున్నారు. అయితే లీగ్స్​లో ఒకటే టీమ్​కు ఆడాలనే రూల్ లేదు. రిటెన్షన్​లో భాగంగా ఉంటే పాత జట్టులోనే ఉండిపోవచ్చు లేదంటే వేరే టీమ్​కూ వెళ్లిపోవచ్చు. సాధారణ ప్లేయర్ల విషయంలో పెద్దగా పట్టించుకోరు. కానీ స్టార్ ఆటగాళ్లు తరచూ జట్లు మారినా.. ఒక టీమ్​లో ఫ్యాన్ బేస్ ఏర్పడ్డాక వదిలేసి వెళ్లిపోతే మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు.

ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ సీజన్ కోసం క్రికెటర్ల రిటెన్షన్/రిలీజ్ కోసం అంతా రెడీ అయిపోయింది. ఇప్పటికే పలు టీమ్స్ మధ్య ప్లేయర్ల ట్రేడింగ్ జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి షహబాజ్ అహ్మద్​ను కొనుగోలు చేసింది సన్​రైజర్స్ హైదరాబాద్. షహబాజ్ ప్లేసులో మయాంక్ దగర్​ను ఆర్సీబీకి ఇచ్చేసింది. రాజస్థాన్​ రాయల్స్​ నుంచి దేవ్​దత్​ పడిక్కల్​ను తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్. అతడకి బదులుగా అవేశ్ ఖాన్​ను రీప్లేస్ చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇప్పటికే బెన్​ స్టోక్స్​ను వదులుకుంది. మరో ప్లేయర్ ప్రిటోరియస్​ను కూడా రిలీజ్‌ చేయాలని అనుకుంటోందట. అయితే రిటెన్షన్​లో అందరి ఫోకస్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీదే ఉంది.

హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్​ కోసం క్యాష్ ట్రేడింగ్​లో గుజరాత్​కు రూ.15 కోట్లు ముంబై చెల్లిస్తోందని క్రికెట్ వర్గాల సమాచారం. తమ ఫ్రాంచైజీకి మారినందుకు పాండ్యాకు మరికొంత మొత్తాన్ని కూడా ఇవ్వనుందట. ఒక ఏడాది గుజరాత్​కు కప్ అందించిన ఈ స్టార్ ఆల్​రౌండర్.. తర్వాతి సంవత్సరం ఫైనల్​కు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో అతడ్ని టైటాన్స్ ఎందుకు వదులుకుంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కెప్టెన్​గా ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించిన ఫ్రాంచైజీని హార్దిక్ ఎందుకు వీడుతున్నాడో కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘యూజ్ అండ్ త్రో అనేది మొదటి నుంచి ఉన్న నిజమైన లక్షణం’ అని ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్టుకు హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ లేదా ముంబై ఇండియన్స్ పేర్లను అతడు మెన్షన్ చేయలేదు. దీంతో పఠాన్ ఎవరి గురించి ఈ పోస్టు పెట్టాడనేది ఆసక్తికరంగా మారింది. కానీ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం పాండ్యాను ఉద్దేశించే అతడీ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. హార్దిక్ టీమ్​ను వీడుతున్నాడనే న్యూస్ వచ్చినప్పుడే ఈ ట్వీట్ చేశాడు కాబట్టి అతడ్ని ఉద్దేశించేనని చెబుతున్నారు. కాగా, గుజరాత్​ను వదిలేసి వస్తున్నందుకు పాండ్యాకు భారీ డబ్బుతో పాటు కొన్ని బిజినెస్ యాడ్స్ అగ్రిమెంట్​ను కూడా ముంబై ఇండియన్స్ ఇచ్చిందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం పాండ్యాకే గాక గుజరాత్ ఫ్రాంచైజీకి రూ.15 కోట్లతో పాటు తెర చాటు భారీ ఆఫర్ ఇచ్చిందని చెబుతున్నారు. ఇది కోట్ల రూపాయలతో ముడిపడిన చీకటి ఒప్పందమని అంటున్నారు. మరి.. పఠాన్ ట్వీట్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మ్యాచ్​లు ఎలా ఫినిష్ చేయాలో అతడ్ని చూసి నేర్చుకుంటున్నా: తిలక్ వర్మ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి