iDreamPost

IPL 2024: SRH vs MI మ్యాచ్ కు వెళ్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి! లేకపోతే..

SRH vs MI మ్యాచ్ కు వెళ్తున్నవారికి అలెర్ట్. ఈ విషయాలు తెలుసుకోకుండా, ఈ వస్తువులు తీసుకెళ్తే.. మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

SRH vs MI మ్యాచ్ కు వెళ్తున్నవారికి అలెర్ట్. ఈ విషయాలు తెలుసుకోకుండా, ఈ వస్తువులు తీసుకెళ్తే.. మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024:  SRH vs MI మ్యాచ్ కు వెళ్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి! లేకపోతే..

ఐపీఎల్ 2024 ఫీవర్ హైదరాబాద్ ను తాకింది. ఈ సీజన్ లో భాగంగా హోం గ్రౌండ్ లో తొలి పోరుకు సిద్దమైంది సన్ రైజర్స్ హైదరాబాద్. బుధవారం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ను ఢీకొనబోతోంది. ఇక భాగ్యనగరంలో జరగబోయే ఈ మ్యాచ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకోండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు కొన్ని వస్తువులను తీసుకురాకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. మరి ఏఏ వస్తువులు తీసుకురాకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన ఆటగాళ్లను దగ్గర నుంచి చూసే ఆ క్షణం కోసం ఆత్రుతగా మైదానికి పరిగెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకోండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. వివిధ బలగాలకు చెందిన 2800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా.. మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు స్టేడియంలోకి కొన్ని వస్తువులు తీసుకురాకూడదని ఆంక్షలు విధించారు పోలీసులు. మరి ఆ వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం. సిగరెట్, బ్యానర్స్, ల్యాప్ ట్యాప్స్, లైటర్స్, ఫర్ ఫ్యూమ్స్, హెల్మెట్స్, బైనాక్యూలర్లు, అగ్గిపెట్టెలు, పెన్నులు, వాటర్ బాటిల్స్, పెన్నులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. వీటితో పాటుగా తిను బండారాలను కూడా వెంట తీసుకురాకూడదని పేర్కొన్నారు. కాగా.. మ్యాచ్ కు వచ్చే ప్రేక్షకులకు వెసులుబాటు కల్పించేందుకు టీఎస్ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్లు ప్రకటించింది. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో  ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు ఇది గమనించి వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అయితే టికెట్లు దొరక్క అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తక్కువ సమయంలోనే ఇన్ని వేల టికెట్లు ఎలా అమ్ముడుపోయాయి? అని ఫైర్ అవుతున్నారు.

ఇదికూడా చదవండి: IPL 2024: తొలి బంతికే సిక్సర్.. రషీద్ ఖాన్ కి చుక్కలు చూపించిన 20 ఏళ్ల కుర్రాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి