iDreamPost

IPL 2024: తొలి బంతికే సిక్సర్.. రషీద్ ఖాన్ కి చుక్కలు చూపించిన 20 ఏళ్ల కుర్రాడు!

ఎంతో అనుభవం ఉన్న బౌలర్ అయిన రషీద్ ఖాన్ కు చుక్కలు చూపించాడు 20 ఏళ్ల యంగ్ బ్యాటర్. అతడి సిక్సర్ల దెబ్బకి బిక్క మెుఖం వేశాడు ఈ స్టార్ బౌలర్.

ఎంతో అనుభవం ఉన్న బౌలర్ అయిన రషీద్ ఖాన్ కు చుక్కలు చూపించాడు 20 ఏళ్ల యంగ్ బ్యాటర్. అతడి సిక్సర్ల దెబ్బకి బిక్క మెుఖం వేశాడు ఈ స్టార్ బౌలర్.

IPL 2024: తొలి బంతికే సిక్సర్.. రషీద్ ఖాన్ కి చుక్కలు చూపించిన 20 ఏళ్ల కుర్రాడు!

ఐపీఎల్ అంటేనే సిక్సులు, ఫోర్లు. వన్డే, టెస్ట్ క్రికెట్ లా రెండు బంతులు డిఫెన్స్ ఆడి.. మూడో బంతికి హిట్టింగ్ చేద్దాంలే అన్నట్లుగా ఇక్కడ ఉండదు. క్రీజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి బాదుడే బాదుడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా తన ఐపీఎల్ కెరీర్ ను ఆరంభించాడు భారత డొమెస్టిక్ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సమీర్ రిజ్వీ. ఈ 20 ఏళ్ల కుర్రాడు తన ఐపీఎల్ కెరీర్ ను ఘనంగా ఆరంభించాడు. ఎంతో అనుభవం ఉన్న బౌలర్ అయిన రషీద్ ఖాన్ కు చుక్కలు చూపించాడు. దీంతో రిజ్వీపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

సమీర్ రిజ్వీ.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ యువ ఆటగాడిపై కోట్లు కుమ్మరించింది చెన్నై. మినీ వేలంలో రూ. 8.40 కోట్ల భారీ ధరకు రిజ్వీని సొంతం చేసుకుంది. దీంతో 20 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ కు ఇంత ధర ఎందుకు చెల్లించారు? అని అందరూ పెదవి విరిచారు. కానీ తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ చూస్తే.. ఈ ధరకు న్యాయం చేసేలా కనిపిస్తున్నాడు అంటూ తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ లభించడంతో.. జడేజా కంటే ముందుగానే క్రీజ్ లోకి అడుగుపెట్టాడు ఈ చిచ్చరపిడుగు.

A 20-year-old boy was beaten

స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో అతడికి చుక్కలు చూపించాడు సమీర్ రిజ్వీ. ఈ ఓవర్ రెండో బంతికి దూబే పెవిలియన్ చేరడంతో.. బ్యాటింగ్ కు దిగాడు రిజ్వీ. తొలి మ్యాచ్, పైగా ఎదుర్కొబోయేది వరల్డ్ క్లాస్ బౌలర్ ని దీంతో ఏ బ్యాటర్ కైనా కాస్తంత ఒత్తిడి అనేది కామన్. కానీ అవేవీ ఈ కుర్ర ప్లేయర్ లో కనిపించలేదు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలిచి.. టీ20ల్లో తాను ఎంత ప్రమాదకర ఆటగాడో ప్రత్యర్థి టీమ్స్ కు హెచ్చరికలు పంపించాడు. స్వ్కేర్ లేగ్ దిశగా భారీ షాట్ తో బంతిని స్టాండ్స్ కు పంపాడు. దీంతో ఆ షాట్ చూసిన రషీద్ ఖాన్ ఒక్కసారిగా బిక్కమెుఖం వేశాడు. ఇదే ఓవర్ లో మరోబంతిని సిక్సర్ గా మలిచి స్టార్ బౌలర్ అయితే నాకేంటి? అన్నట్లుగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత మోహిత్ శర్మ ఓవర్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. 6 బంతుల్లో 2 సిక్సర్లతో 14 రన్స్ చేశాడు ఈ యంగ్ బ్యాటర్. దీంతో ఐపీఎల్ లో తొలి బంతికే సిక్సర్ కొట్టిన 9వ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. మరి రషీద్ ఖాన్ కే చుక్కలు చూపించిన యంగ్ బ్యాటర్ సమీర్ రిజ్వీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: MS Dhoni: ధోని కళ్లు చెదిరే క్యాచ్.. 42 ఏళ్ల వయసులో చిరుతలా! వీడియో వైరల్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి