iDreamPost

చరిత్ర సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో పొగరును అణచిన పంత్ సేన!

  • Published Apr 13, 2024 | 9:23 AMUpdated Apr 13, 2024 | 9:23 AM

రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి బడా టీమ్స్​కు కూడా సాధ్యం కానిది చేసి చూపించింది.

రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి బడా టీమ్స్​కు కూడా సాధ్యం కానిది చేసి చూపించింది.

  • Published Apr 13, 2024 | 9:23 AMUpdated Apr 13, 2024 | 9:23 AM
చరిత్ర సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో పొగరును అణచిన పంత్ సేన!

వరుస ఓటములతో డీలాపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తమ అభిమానులకు ఊరటను ఇస్తూ విజయాన్ని సాధించింది. హ్యాట్రిక్ విక్టరీలతో బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తున్న లక్నో సూపర్ జియాంట్స్​కు పంత్ సేన షాక్ ఇచ్చింది. ఈ రెండు టీమ్స్ మధ్య లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో డీసీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్​లో ఆఖరి స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఒక స్థానం ఎగబాకి తొమ్మిదో ప్లేస్​కు చేరుకుంది. ఫ్లాట్ వికెట్​ కావడం హైస్కోరింగ్ మ్యాచ్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ డీసీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/20) చెలరేగాడు. టాపార్డర్​ను అతడు కూల్చడంతో ఎల్​ఎస్​జీ 167 పరుగులే చేయగలిగింది. ఈ టార్గెట్​ను మరో 11 బంతులు ఉండగానే డీసీ ఛేదించింది. ఈ మ్యాచ్ ద్వారా పంత్ సేన చరిత్ర సృష్టించింది.

లక్నో టీమ్ మీద 160 ప్లస్ టార్గెట్​ను ఛేజ్ చేసిన ఫస్ట్ టీమ్​గా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు క్రియేట్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సహా ఏ జట్టు కూడా ఎల్​ఎస్​జీతో మ్యాచ్​లో 160 ప్లస్ స్కోర్లను ఛేదించలేదు. అయితే డీసీ దీన్ని తిరగరాసింది. ఆ టీమ్ విసిరిన 167 పరుగుల టార్గెట్​ను మరో 11 బంతులు ఉండగానే రీచ్ అయింది. 160 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల్ని 13 సార్లు డిఫెండ్ చేసింది లక్నో. ఆ జట్టుతో మ్యాచ్​లో ఛేజ్ చేయడం చాలా కష్టం. బిగ్ టీమ్స్ కూడా ఎల్ఎస్​జీతో రన్ ఛేజ్ అంటే భయపడతాయి. అలాంటిది ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అలవోకగా టార్గెట్​ను రీచ్ అయి హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో 160 ప్లస్ టార్గెట్ డిఫెండ్ చేయడంలో 13-0తో అజేయంగా ఉన్న రాహుల్ సేనకు షాక్ తగిలింది.

ఢిల్లీ క్యాపిటల్స్ రేర్ ఫీట్​ఫై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆస్ట్రేలియాను గబ్బా స్టేడియంలో ఓడించి పొగరు అణచిన రిషబ్ పంత్​ ఇప్పుడు లక్నో గర్వాన్ని అణిచాడని కామెంట్స్ చేస్తున్నారు. బౌలింగ్​లో కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.. బ్యాటింగ్​లో జేక్ ఫ్రేజర్ రాకతో డీసీ పటిష్టంగా మారిందని అంటున్నారు. డీసీ ఇదే విధంగా ఆడితే పెద్ద టీమ్స్​కు కూడా షాకులు తగలక తప్పదని చెబుతున్నారు. కాగా, గబ్బాలో ఆసీస్ ఓడినప్పుడు ఆ టీమ్​కు కోచ్​గా జస్టిన్ లాంగర్ ఉన్నాడు. ఇప్పుడు ఎల్​ఎస్​జీ కోచ్​గా ఆయనే ఉన్నాడు. దీంతో లాంగర్ టీమ్​ను టార్గెట్ చేసి మరీ కొట్టడం పంత్​కు అలవాటైందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. డీసీ రేర్ ఫీట్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి