Nidhan
రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి బడా టీమ్స్‌కు కూడా సాధ్యం కానిది చేసి చూపించింది.
రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి బడా టీమ్స్‌కు కూడా సాధ్యం కానిది చేసి చూపించింది.
Nidhan
వరుస ఓటములతో డీలాపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తమ అభిమానులకు ఊరటను ఇస్తూ విజయాన్ని సాధించింది. హ్యాట్రిక్ విక్టరీలతో బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకెళ్తున్న లక్నో సూపర్ జియాంట్స్‌కు పంత్ సేన షాక్ ఇచ్చింది. ఈ రెండు టీమ్స్ మధ్య లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డీసీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఒక స్థానం ఎగబాకి తొమ్మిదో ప్లేస్‌కు చేరుకుంది. ఫ్లాట్ వికెట్ కావడం హైస్కోరింగ్ మ్యాచ్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ డీసీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/20) చెలరేగాడు. టాపార్డర్‌ను అతడు కూల్చడంతో ఎల్ఎస్జీ 167 పరుగులే చేయగలిగింది. ఈ టార్గెట్‌ను మరో 11 బంతులు ఉండగానే డీసీ ఛేదించింది. ఈ మ్యాచ్ ద్వారా పంత్ సేన చరిత్ర సృష్టించింది.
లక్నో టీమ్ మీద 160 ప్లస్ టార్గెట్‌ను ఛేజ్ చేసిన ఫస్ట్ టీమ్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు క్రియేట్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సహా ఏ జట్టు కూడా ఎల్ఎస్జీతో మ్యాచ్‌లో 160 ప్లస్ స్కోర్లను ఛేదించలేదు. అయితే డీసీ దీన్ని తిరగరాసింది. ఆ టీమ్ విసిరిన 167 పరుగుల టార్గెట్‌ను మరో 11 బంతులు ఉండగానే రీచ్ అయింది. 160 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల్ని 13 సార్లు డిఫెండ్ చేసింది లక్నో. ఆ జట్టుతో మ్యాచ్‌లో ఛేజ్ చేయడం చాలా కష్టం. బిగ్ టీమ్స్ కూడా ఎల్ఎస్జీతో రన్ ఛేజ్ అంటే భయపడతాయి. అలాంటిది ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అలవోకగా టార్గెట్‌ను రీచ్ అయి హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో 160 ప్లస్ టార్గెట్ డిఫెండ్ చేయడంలో 13-0తో అజేయంగా ఉన్న రాహుల్ సేనకు షాక్ తగిలింది.
ఢిల్లీ క్యాపిటల్స్ రేర్ ఫీట్ఫై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆస్ట్రేలియాను గబ్బా స్టేడియంలో ఓడించి పొగరు అణచిన రిషబ్ పంత్ ఇప్పుడు లక్నో గర్వాన్ని అణిచాడని కామెంట్స్ చేస్తున్నారు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.. బ్యాటింగ్‌లో జేక్ ఫ్రేజర్ రాకతో డీసీ పటిష్టంగా మారిందని అంటున్నారు. డీసీ ఇదే విధంగా ఆడితే పెద్ద టీమ్స్‌కు కూడా షాకులు తగలక తప్పదని చెబుతున్నారు. కాగా, గబ్బాలో ఆసీస్ ఓడినప్పుడు ఆ టీమ్‌కు కోచ్‌గా జస్టిన్ లాంగర్ ఉన్నాడు. ఇప్పుడు ఎల్ఎస్జీ కోచ్‌గా ఆయనే ఉన్నాడు. దీంతో లాంగర్ టీమ్‌ను టార్గెట్ చేసి మరీ కొట్టడం పంత్‌కు అలవాటైందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. డీసీ రేర్ ఫీట్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
LSG have lost a game for the 1st time while defending a target of over 160 😱#IPL2024 #LSGvDC pic.twitter.com/JYKXtoR419
— Sport360° (@Sport360) April 12, 2024
DELHI CAPITALS – FIRST TEAM IN IPL HISTORY TO SUCCESSFULLY CHASE 160+ TOTAL VS LSG. 🤯
– Rishabh Pant and his army have created history. 💥 pic.twitter.com/wNL3p2l0XG
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2024