iDreamPost

Hardik Pandya: SRHపై ఓటమి.. నిలబెట్టి పాండ్యా పరువు తీసిన పఠాన్!

సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే పాండ్యా పరువు తీశాడు ఇర్ఫాన్ పఠాన్. ఆ వివరాల్లోకి వెళితే..

సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే పాండ్యా పరువు తీశాడు ఇర్ఫాన్ పఠాన్. ఆ వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: SRHపై ఓటమి.. నిలబెట్టి పాండ్యా పరువు తీసిన పఠాన్!

సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ రికార్డులు బద్దలైయ్యాయి. మరికొన్ని ఘనతలు బ్యాటర్లకు సలామ్ కొట్టి గులామ్ గా మారాయి. ఇక ప్రేక్షకులుకు ఇప్పటి వరకు ఇవ్వని కిక్కిచ్చింది ఈ మ్యాచ్. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియం తడిసిముద్దైంది. హోరాహోరిగా జరిగిన ఈ పోరులో తన శక్తి మేరకు పోరాడిన ముంబై ఇండియన్స్ విజయానికి 31 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ముప్పేట విమర్శల దాడిచేస్తున్నారు మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు. ఈ క్రమంలోనే పాండ్యా పరువు తీశాడు ఇర్ఫాన్ పఠాన్. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబై ఇండియన్స్ కు ఏ ముహుర్తాన కెప్టెన్ అయ్యాడోగానీ.. హార్దిక్ పాండ్యాకు అన్ని కష్టాలే ఎదురౌతున్నాయి. ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. దీంతో కెప్టెన్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో పాండ్యా తీసుకున్న చెత్త నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్. “హైదరాబాద్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతుంటే జస్ప్రీత్ బుమ్రాను బౌలింగ్ కు దింపకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ నిర్ణయం షాక్ కు గురిచేసింది. టీమ్ లోని బ్యాటర్లు 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే.. హార్దిక్ మాత్రం 120తో చేశాడు. ఈ మ్యాచ్ లో అతడి కెప్టెన్సీతో పాటుగా బ్యాటింగ్ లో దారుణంగా విఫలం అయ్యాడు” అంటూ విమర్శలు గుప్పించాడు.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేయలేదు. నాలుగో ఓవర్ ను పాండ్యా బుమ్రాకు ఇచ్చాడు. ఆ తర్వాత ఏకంగా 12 ఓవర్లలో ఒకసారి మాత్రమే బౌలింగ్ చేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సన్ రైజర్స్ 7 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ చెలరేగి ఆడటంతో.. ఐపీఎల్ లో రికార్డు స్థాయిలో పరుగులు చేసింది. 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది సన్ రైజర్స్. పాండ్యా చేసిన తప్పిదం వల్ల ముంబై భారీ మూల్యం చెల్లించుకుంది. ఇదే అభిప్రాయాన్ని ఆసీస్ మాజీ స్పీడ్ బౌలర్ బ్రెట్ లీ కూడా తెలియపరిచాడు. బుమ్రాతో పవర్ ప్లేలో 1, 4వ ఓవర్లు వేయించాలని బ్రెట్ లీ సూచించాడు. మరి ఈ మ్యాచ్ లో పాండ్యా కెప్టెన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఘోర ఓటమి తర్వాత రోహిత్‌తో మాట్లాడిన ఆకాశ్‌ అంబానీ! బ్యాక్‌ టూ కెప్టెన్సీ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి