iDreamPost

Hardik Pandya: నువ్వేమైనా ధోనివా? పాండ్యా పరువుతీసిన మహ్మద్ షమీ!

హార్దిక్ పాండ్యా పరువుతీసేశాడు గుజరాత్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ. నువ్వేమైనా ధోని అనుకుంటున్నావా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షమీ ఈ కామెంట్స్ ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

హార్దిక్ పాండ్యా పరువుతీసేశాడు గుజరాత్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ. నువ్వేమైనా ధోని అనుకుంటున్నావా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షమీ ఈ కామెంట్స్ ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Hardik Pandya: నువ్వేమైనా ధోనివా? పాండ్యా పరువుతీసిన మహ్మద్ షమీ!

గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చి ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ అయిన దగ్గర నుంచి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా గుజరాత్ పై ఓడిపోవడంతో.. ఈ విమర్శలు ఇంకాస్త ఎక్కువైయ్యాయి. అదీకాక గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ అనుసరించిన వ్యూహాలపై మాజీ క్రికెటర్లతో పాటుగా సహచర ఆటగాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్ ప్లేయర్ మహ్మద్ షమీ పాండ్యా పరువుతీశాడు. నవ్వేమీ ధోనివి కావు.. నీకంత సీన్ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు షమీ. ఇంకా ఏమన్నాడంటే?

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొన్ని విచిత్రమైన వ్యూహాలను అనుసరించాడు. ఆ ప్లాన్స్ కాస్త బెడిసికొట్టడంతో.. 6 రన్స్ తో ఓటమిచవిచూడాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో హార్దిక్ అనుసరించిన వ్యూహాలపై మాజీ క్రికెటర్లతో పాటుగా ఇతర ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అనుభవం గల బుమ్రాను వాడుకోవడంలో పాండ్యా పూర్తిగా విఫలం అయ్యాడని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే హార్దిక్ పై విరుచుకుపడ్డాడు భారత సీనియర్ పేసర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ.

హార్దిక్ వ్యూహాలపై మహ్మద్ షమీ మాట్లాడుతూ..”హార్దిక్ నువ్వు గత రెండు సీజన్ల నుంచి 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నావు. ఆ నెంబర్ లో బ్యాటింగ్ చేయడానికి నువ్వు అలవాటు పడ్డావు. అయితే అవసరం అనుకుంటే.. 5వ నంబర్ లో బ్యాటింగ్ కు దిగొచ్చు. కానీ నువ్వు 7వ నంబర్ లో బ్యాటింగ్ కు దిగడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పైగా నువ్వు ధోనివి అంతకన్నా కావు. ధోని ఎప్పుడైనా ధోనినే. అతనిని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. అతనిలా ఏడో నంబర్ లో బ్యాటింగ్ కు దిగి గొప్ప ఫినిషర్ అవ్వడం నీ వల్ల కాదు” అంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షమీ కామెంట్స్ ను సపోర్ట్ చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి హార్దిక్ పాండ్యాపై తాజాగా మహ్మద్ షమీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్‌ బుమ్రాను కూడా అవమానించిన హార్దిక్‌ పాండ్యా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి