iDreamPost

రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్‌ బుమ్రాను కూడా అవమానించిన హార్దిక్‌ పాండ్యా!

ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చాలా మందికి హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను అవమానించాడనే తెలుసు. కానీ జస్ప్రీత్ బుమ్రాను కూడా పాండ్యా అవమానించాడని మీలో ఎంతమందికి తెలుసు? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చాలా మందికి హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను అవమానించాడనే తెలుసు. కానీ జస్ప్రీత్ బుమ్రాను కూడా పాండ్యా అవమానించాడని మీలో ఎంతమందికి తెలుసు? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్‌ బుమ్రాను కూడా అవమానించిన హార్దిక్‌ పాండ్యా!

హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ ప్రారంభం కాక ముందు నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాపేరు. క్యాష్ ఆన్ ట్రేడ్ ద్వారా గుజరాత్ నుంచి ముంబైకి వచ్చిన ఈ స్టార్ ఆల్ రౌండర్.. తన యాటిట్యూడ్ ను మాత్రం తగ్గించుకోలేదు. ముంబై కెప్టెన్ అవ్వడంతో అది ఇంకాస్త ఎక్కువైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వారు అనుకున్నట్లుగానే తన పొగరును తన మాజీ జట్టు అయిన గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చూపించాడు. సొంత టీమ్ ఆటగాళ్లు రోహిత్, బుమ్రాను అవమానించాడు పాండ్యా. రోహిత్ ను అవమానించిన విషయం మనకు తెలిసిందే. కానీ బుమ్రాను ఎలా అవమానించాడు? అన్నదే కదా మీ అనుమానం. తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓడిపోయింది. గుజరాత్ తో జరిగిన పోరులో 6 రన్స్ తో పరాజయం పాలైంది. ఇక ఈ మ్యాచ్ లో పాండ్యా తన మార్క్ కెప్టెన్సీ చూపించినప్పటికీ.. కాస్త యాటిట్యూడ్ కూడా చూపించాడు. ఈ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా.. రోహిత్ ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కోసం అటూ ఇటూ తిప్పడం రోహిత్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు క్రికెట్ అభిమానులకు కూడా నచ్చలేదు. ఐదు టైటిళ్లు అందించిన ప్లేయర్ ను ఇలాగేనా నువ్వు అవమానించేది అంటూ నెటిజన్లు పాండ్యాపై ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. రోహిత్ తో పాటుగా సీనియర్ బౌలర్ బుమ్రాను సైతం పాండ్యా ఘోరంగా అవమానించాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకుండా పాండ్యానే వేశాడు. అసలైతే.. ఎప్పటి నుంచో ఇటు టీమిండియాలోనైనా లేక ముంబై టీమ్ లో నైనా బుమ్రానే తొలి ఓవర్ వేస్తాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కెప్టెన్ నేనే కాబట్టి ఫస్ట్ ఓవర్ నేనే వేయాలి అన్నతీరుగా పాండ్యా వ్యవహరించాడు. బుమ్రా లాంటి స్పెషలిస్ట్ బౌలర్ ఉండగా నువ్వెందుకు తొలి ఓవర్ వేయాల్సి వచ్చింది? అంటూ సగటు క్రీడాభిమానులు ప్రశ్నిస్తున్నారు. పిచ్ ఎలా రియాక్ట్ అవుతుందో.. తెలుసుకోకుండానే పాండ్యా బౌలింగ్ వేయడం విమర్శలకు దారితీస్తోంది.

అయితే బుమ్రాతో పాటుగా లూక్ వుడ్, గెరాల్డ్ కోయెట్జీ లాంటి బౌలర్లు ఉన్నా.. వారికి ఛాన్స్ ఇవ్వకుండా తానే బౌలింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి.. 30 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో నువ్వు పొడిచింది ఏంటి? అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. బుమ్రా 3 వికెట్లతో రాణించాడు. అయితే ఇలా కెప్టెనే తొలి ఓవర్ వేయడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా రెండుసార్లు ఇలా ఫస్ట్ ఓవర్లు వేశాడు. ఆ రెండుసార్లు ముంబైపైనే కావడం గమనార్హం. మరి రోహిత్ ను అవమానించడమే కాకుండా.. తొలి ఓవర్ ఇవ్వకుండా బుమ్రాను కూడా ఇలాగే ఇన్ సల్ట్ చేసిన పాండ్యాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: MI vs GT: నెహ్రా vs పాండ్యా.. ఇది రోహిత్‌ vs పాండ్యాను మించిన గొడవ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి