iDreamPost

SRH vs MI: ఓటమిపై స్పందించిన పాండ్యా.. కొంచెం కూడా బాధలేదట! కానీ..

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో తమ ఓటమికి కారణాలను వెల్లడించాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరి ఆ రీజన్స్ ఏంటో చూద్దాం.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో తమ ఓటమికి కారణాలను వెల్లడించాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరి ఆ రీజన్స్ ఏంటో చూద్దాం.

SRH vs MI: ఓటమిపై స్పందించిన పాండ్యా.. కొంచెం కూడా బాధలేదట! కానీ..

ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు వరుస పరాజయాలు స్వాగతం పలుకుతున్నాయి. తొలి మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిపోయిన ఎంఐ టీమ్.. తాజాగా సన్ రైజర్స్ దెబ్బకు కంగుతిన్నది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో పాండ్యా టీమ్ ఓటమిపాలైంది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ పోరులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. ఇక మ్యాచ్ లో తాము ఓడిపోవడానికి కారణాలు వెల్లడించాడు కెప్టెన్ హార్దిక్. ఓడిపోయినందుకు కొంచెం కూడా బాధలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్ 2024 సీజన్ లో ప్రేక్షకులకు అసలైన మజాను చూపించింది సన్ రైజర్స్-ముంబై టీమ్స్. 278 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఎంఐ టీమ్ తన శక్తిమేరకు పోరాడింది. కానీ విజయం మాత్రం సన్ రైజర్స్ నే వరించింది. మ్యాచ్ అనంతరం తమ ఓటమికి కారణాలను వెల్లడించాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. “మేము ఈ మ్యాచ్ లో కొన్ని ప్రయోగాలు చేశాం. అయితే ఆ ప్రయోగాలు విఫలం అయ్యాయి. కానీ అది మాకు సంతోషమే. మా టీమ్ అత్యుత్తమమైన యంగ్ బౌలర్లను కలిగిఉంది. వారిని ఈ మ్యాచ్ ద్వారా పరీక్షించాం. ఈరోజు నేను చూసిన వారి ప్రదర్శన నాకు నచ్చింది” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు పాండ్యా.

సౌతాఫ్రికా యువ ప్లేయర్ క్వేనా మపాక ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. దాంతో ముంబై ఇతడిని కొనుగోలు చేసింది. కానీ ఎంట్రీ మ్యాచ్ లోనే సన్ రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపించారు మపాకాకు. అతడు 4 ఓవర్లకు 66 పరుగులు సమర్పించుకున్నాడు. మరో సంచలం కోయెట్జీ కూడా తన పూర్తి కోటాలో 57 రన్స్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం కొండంత టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 రన్స్ చేసి 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి ఓటమికి పాండ్యా చెప్పిన రీజన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: MI vs SRH: సన్ రైజర్స్ మహోగ్రరూపం.. SRH విజయానికి 5 ప్రధాన కారణాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి