iDreamPost

ఢిల్లీ బలం, బలహీనతలు! ఈ సారైనా తొలి కప్పు ముద్దాడుతుందా?

  • Published Mar 21, 2024 | 9:06 PMUpdated Mar 21, 2024 | 9:06 PM

ఐపీఎల్-2024లో మ్యాజిక్ చేయాలని చూస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి కప్పు ఎగరేసుకుపోవాలని భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని డీసీ.. ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పంత్ సేన బలం, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2024లో మ్యాజిక్ చేయాలని చూస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి కప్పు ఎగరేసుకుపోవాలని భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని డీసీ.. ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పంత్ సేన బలం, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 21, 2024 | 9:06 PMUpdated Mar 21, 2024 | 9:06 PM
ఢిల్లీ బలం, బలహీనతలు! ఈ సారైనా తొలి కప్పు ముద్దాడుతుందా?

ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని జట్లలో ఢిల్లీ కూడా ఒకటి. చాలా మంది సూపర్​స్టార్లు ఈ టీమ్​కు ఆడినా కప్పు కలను మాత్రం నెరవేర్చలేకపోయారు. ఫ్యాన్​ బేస్​లో కూడా సీఎస్​కే, ఆర్సీబీ, ఎంఐ లాంటి జట్లతో పోల్చుకుంటే ఢిల్లీ కాస్త వెనుకంజలోనే ఉంది. అయితే టీమిండియా తరఫున సూపర్బ్​గా ఆడుతూ ఫ్యూచర్ స్టార్​గా పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ ఆడుతుండటంతో క్యాపిటల్స్​ మ్యాచులపై అందరి ఫోకస్ నెలకొంది. పంత్​తో పాటు పలువురు భారత సీనియర్ టీమ్ ఆటగాళ్లు ఇందులో ఉండటంతో మంచి క్రేజ్ నెలకొంది. గాయం కారణంగా దూరమైన పంత్.. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుండటంతో ఢిల్లీ టీమ్ మీద మంచి ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు బలం, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బలం

ఢిల్లీ క్యాపిటల్స్ అతిపెద్ద బలం రిషబ్ పంత్. రీఎంట్రీ ఇస్తున్న అతడు.. ఫుల్​ ఫిట్​గా కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్​లో అతడు భారీ షాట్లు బాదుతూ ఓల్డ్ పంత్​ను గుర్తుకు తెస్తున్నాడు. బ్యాటర్​గా, కెప్టెన్​గా టీమ్​కు అతడే కొండంత బలం. ఒకవేళ పంత్ మంచి ఫామ్​లో ఉంటే మాత్రం డీసీకి టోర్నీలో ముందుకు వెళ్లే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. రిషబ్​తో పాటు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, హ్యారీ బ్రూక్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో క్యాపిటల్స్ బ్యాటింగ్ యూనిట్ సూపర్ స్ట్రాంగ్​గా ఉంది. నోర్జే, ముకేశ్ కుమార్, మార్ష్ లాంటి క్వాలిటీ పేసర్లతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి హైక్లాస్ స్పిన్నర్లతో ఢిల్లీ బౌలింగ్ దళం కూడా బలంగా ఉంది. ఆల్​రౌండర్స్ అయిన అక్షర్, మార్ష్​లు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే డీసీకి తిరుగుండదు.

DCP

బలహీనతలు

ఆల్​రౌండర్ల కొరత డీసీని ఇబ్బంది పెడుతోంది. మార్ష్​, అక్షర్ రూపంలో మంచి ఆల్​రౌండర్లు ఉన్నా.. వాళ్లు ఫెయిలైతే బ్యాకప్ ఆప్షన్స్ లేవు. మార్ష్​, అక్షర్​ మీద అతిగా ఆధారపడటం ఆ ఇద్దరి మీద అదనపు ఒత్తిడిని పెంచుతోంది. బ్యాటింగ్​లో అంతా బాగానే ఉన్నా.. పృథ్వీ షా ఒక్కడితో సమస్య అనే చెప్పాలి. గత సీజన్లలో అతడు తన స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. బౌలింగ్​లో నోర్జే రూపంలో లీథల్ పేసర్ ఉన్నాడు. కానీ గాయాలతో సావాసం చేస్తున్న ఈ సౌతాఫ్రికా ఆటగాడు.. ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అతడికి గాయం తిరగబెడితే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. పంత్ కూడా ఘోరమైన ప్రమాదం నుంచి కోలుకొని కమ్​బ్యాక్ ఇస్తున్నాడు. అతడి ఫిట్​నెస్ మీద కూడా ఓ కన్నేసి ఉంచాలి.

గత రికార్డులు

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఒక్కసారి మాత్రం టోర్నీ ఫైనల్స్​కు చేరుకుంది. 2020లో తుది సమరానికి అర్హత సాధించిన డీసీ.. ఫైనల్​లో ఓడి రన్నరప్​గా నిలిచింది. గత రెండేళ్లు లీగ్ స్టేజ్​కు పరిమితమైంది.

విజయావకాశాలు

డీసీ బలం, బలహీనతలు, గత రికార్డులు, ప్రస్తుత టీమ్ కాంబినేషన్, ఆటగాళ్ల ఫామ్, ఫిట్​నెస్ లాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆ టీమ్ ప్లేఆఫ్స్​కు చేరుకోవడం కష్టమే. ఒకవేళ పంత్​, వార్నర్​, మార్ష్​తో పాటు కుల్దీప్, నోర్జే లాంటి ఆటగాళ్లు అద్భుతంగా ఆడితే ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి