iDreamPost
android-app
ios-app

HYD: నడి రోడ్డున కట్టుకున్న భార్యపై భర్త కిరాతకం! ఏం చేశాడో తెలుసా?

HYD: నడి రోడ్డున కట్టుకున్న భార్యపై భర్త కిరాతకం! ఏం చేశాడో తెలుసా?

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కట్టుకున్న భార్యపై కిరాతకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల అంతా పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లోని మునగనూర్ లో బాలకోటయ్య-శాలిని భార్యాభర్తలు నివాసం ఉండేవారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య వనస్థలిపురంలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. భర్త బాలకోటయ్య మాత్రం.. బొమ్మలగుడి వద్ద ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే బాలకోటయ్య తన భార్యపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైన భార్యను హత్య చేయాలని భావించాడు.

ఇందులో భాగంగానే పక్కా స్కెచ్ వేశాడు. కాగా, భార్య శాలిని శుక్రవారం తన సోదరికి ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం స్కూటీపై వనస్థలిపురం బయలు దేరింది. ఇది తెలుసుకున్న భర్త బాలకోటయ్య భార్యను మార్గమధ్యలో అడ్డుకున్నాడు. స్కూటీని కిందపడేయంతో శాలిని కిందపడిపోయింది. ఇదే మంచి తరుణం అనుకున్న భర్త.. పక్కనే ఉన్న బండరాయితో భార్య తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో భార్య శాలిని అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది.

దీంతో బాలకోటయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శాలిని భర్త చేతిలో హత్యకు గురైందని తెలిసి ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet