iDreamPost

భర్త లేని టైమ్ చూసి ఇంట్లోకి దూరిన వ్యక్తి.. భర్త సడెన్ ఎంట్రీతో..

  • Author Soma Sekhar Published - 10:06 AM, Sat - 7 October 23
  • Author Soma Sekhar Published - 10:06 AM, Sat - 7 October 23
భర్త లేని టైమ్ చూసి ఇంట్లోకి దూరిన వ్యక్తి.. భర్త సడెన్ ఎంట్రీతో..

సత్యసాయి జిల్లా గంగవరం గ్రామానికి చెందిన రమేష్-అంజలి భార్య భర్తలు. వీరికి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమేష్ కూలీ పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి ఓబులేసు అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అక్కడి నుంచి వీరి జీవితం మరోమలుపు తిరిగింది. అనుమానం పెనుభూతం కావడంతో.. దారుణ ఘటన చోటుచేసుకుంది. కలకలం రేపిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గంగవరం గ్రామానికి చెందిన రమేష్ తో గుంతకల్లు పట్టణానికి చెందిన అంజలికి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమార్తె ధరణి(7), కొడుకు లోకేష్(5) ఉన్నారు. రమేష్ కూలీ పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఈ క్రమంలోనే గంగవరం గ్రామానికి చెందిన ఓబులేసు అనే వ్యక్తి తన కోరిక తీర్చాలంటూ.. గత కొంతకాలంగా అంజలి వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. బుధవారం రమేష్ కూలీ పనికి బయటకి వెళ్లాడు. ఇది గమనించిన ఓబులేసు అంజలి ఇంట్లోకి వెళ్లాడు.

ఈ క్రమంలోనే కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన రమేష్ కు ఓబులేసు కనిపించాడు. అంజలి భర్తను చూసిన ఓబులేసు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తన భార్యపై అనుమానంతో రమేష్ ఆమెతో గొడవకు దిగాడు. ఈ గొడవలో కోపోద్రిక్తుడై ఆమెను కట్టెతో తలపై కొట్టాడు. తీవ్ర గాయాలైన అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అంజలి మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అంజలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి