iDreamPost
android-app
ios-app

బోనాల్లో కొండచిలువతో పోతురాజు హల్చల్.. కట్ చేస్తే, సీన్ రివర్స్!

బోనాల్లో కొండచిలువతో పోతురాజు హల్చల్.. కట్ చేస్తే, సీన్ రివర్స్!

తెలంగాణ పండుగల్లో ప్రధానంగా అందరికీ గుర్తొచ్చే పండుగా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బోనాల పండుగనే చెప్పాలి. గత రెండు రోజుల కిందట హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు వాడ వాడ ఘనంగా జరిగాయి. ఇక భక్తులంతా భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనాలు సమర్పించి కోరికలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఇటీవల పాతబస్తి మొఘల్ పురలో ఉన్న అక్కన్న మాదన్న గుడి వద్ద బోనాల ఉత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా నాగరాజు అనే యువకుడు పోతురాజు వేషం వేసి తన డ్యాన్స్ తో అదరగొట్టాడు. కానీ, నాగరాజు కాస్త అత్సుత్సాహం ప్రదర్శించి ఈరకోల పట్టుకోవాల్సిన చేతిలో ఏకంగా కొండ చిలువను పట్టుకున్నాడు.

ఇక అదే కొండ చిలువతో అతడు విన్యాసాలు చేస్తూ భక్తులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయబోయాడు. కానీ, అదే సమయానికి అటు నుంచి వెళ్తున్న జంతు సంరక్షణ అధికారులు ఇదంతా గమనించారు. వెంటనే పోతురాజు వేషం వేసిన నాగరాజును అదుపులోకి తీసుకుని ఆ కొండ చిలువను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జంతు సంరక్షణ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జంతు చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే, పోతురాజు వేషంలో ఉన్న నాగరాజు కొండ చిలువతో చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: దంపతుల ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?