iDreamPost

ఓటమి ఎరుగని అసద్‌పై పోటీకి మాధవిలత.. ఎవరీమే.. బ్యాగ్రౌండ్‌ ఏంటి

  • Published Mar 04, 2024 | 12:58 PMUpdated Mar 04, 2024 | 12:58 PM

Kompella Madhavi Latha: హైదరాబాద్‌ ఎంపీగా ఉన్న అసద్‌పై రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి మాధవి లత పోటీ చేయనుంది. దాంతో అసలు ఎవరీమే.. ఆమె బ్యాగ్రౌండ్‌ ఏంటి అనే దానిపై అందరికి ఆసక్తి నెలకొని ఉంది. ఆ వివరాలు..

Kompella Madhavi Latha: హైదరాబాద్‌ ఎంపీగా ఉన్న అసద్‌పై రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి మాధవి లత పోటీ చేయనుంది. దాంతో అసలు ఎవరీమే.. ఆమె బ్యాగ్రౌండ్‌ ఏంటి అనే దానిపై అందరికి ఆసక్తి నెలకొని ఉంది. ఆ వివరాలు..

  • Published Mar 04, 2024 | 12:58 PMUpdated Mar 04, 2024 | 12:58 PM
ఓటమి ఎరుగని అసద్‌పై పోటీకి మాధవిలత.. ఎవరీమే.. బ్యాగ్రౌండ్‌ ఏంటి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా దక్షిణాదిలో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రా‍ల నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లలో గెలవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా మజ్లీస్‌కు కంచుకోటలా మారిన హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున మాధవీలతకి టికెట్‌ కేటాయించింది. సుమారు ఇరవై ఏళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరఫున విజయం సాధిస్తూ వస్తోన్న అసదుద్దీన్‌కు చెక్‌ పెట్టడం కోసం బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఓటమి ఎరుగని అసద్‌పై ఏమాత్రం రాజకీయ అనుభవం లేని మాధవి లతను పోటీకి దించడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అసలు ఎవరీ మాధవి లత.. ఆమె బ్యాగ్రౌండ్‌ ఏంటి.. ఆమెకు బీజేపీ టికెట్‌ కేటాయించడం వెనక గల కారణాలు ఏంటి అనే దానిపై జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..

లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలోనే కొంపెల్లి మాధవీలతకు స్థానం దక్కడం సంచలనంగా మారింది. ఇన్నాళ్లు ఆమె ఏ రాజకీయ పార్టీలో కూడా లేరు. బీజేపీ టికెట్‌ ప్రకటించిన తర్వాతనే.. ఆమె ఢిల్లీ వెళ్లి.. పార్టీ తెలంగాణ ఇంచార్జ్‌ తరుణ్‌చుగ్‌ ఆధ్వర్యంలో కాషాయ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలో లేనంటూ వస్తోన్న విమర్శలను ఆమె సున్నితంగా కొట్టిపారేశారు. అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోను అన్నారు.

అంతేకాక కుటుంబం లాంటి పార్టీలోని వారు చేసే కామెంట్స్‌ పట్టించుకోవద్దని.. తర్వాత వారే అర్థం చేసుకుంటారని చెప్పుకొచ్చారు మాధవి లత. ఇక తాను ఎంతో కాలం నుంచి సంఘ్‌లో ఉన్నానని.. 18 ఏళ్లుగా సేవ చేస్తున్నానని.. దాన్ని గుర్తించే బీజేపీ అధిష్టానం తనకు హైదరాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ధర్మం, న్యాయం తెలిసినదాన్నని.. ఇన్నాళ్లు ప్రజా సేవలో ఉన్నానని.. ఇక మీదట కూడా అదే మార్గంలో నడుస్తానని చెప్పుకొచ్చారు మాధవి లత.

ఈసందర్బంగా మాధవి లత అసదుద్దీన్‌ ఓవైసీకీ ఓ సవాల్‌ విసిరారు. ‘‘అసద్‌ భాయ్‌.. నేనొస్తున్నాను.. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఇకపై కూడా కొనసాగిస్తే.. ఊరుకునేది లేదు. పాత బస్తీలో మైనార్టీలకు, హిందువులకు ఎవరికీ కూడా మీరు న్యాయం చేయడం లేదని’’ ఆరోపించారు. అంతేకాక ఎంతోమంది యువకులను అన్యాయంగా జైలు పాలు చేశారని విమర్శించారు. ఈసారి హైదరాబాద్‌లో మార్పు తథ్యమని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. 40 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో మార్పు రాబోతుందుని.. అసదుద్దీన్‌ను ప్రజలు ఇంటికి పంపించడం ఖామని.. తాను విజయం సాధించడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కొంపెల్ల మాధవిలత నేపథ్యం..

బీజేపీ పార్టీ హైదరాబాద్‌ ఎంపీగా మాధవిలతను ప్రకటించడంతో.. ఒక్కసారిగా ఆమె వార్తల్లో నిలిచారు. అసదుద్దీన్‌పై పోటీ చేస్తుండటంతో.. ఆమె బ్యాగ్రౌండ్‌ ఏంటి.. వంటి వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు జనాలు. ఇక మాధవిలత విషయానికి వస్తే.. ఆమె హైదరాబాద్ యాకుత్‌పురా నియోజకవర్గం సంతోశ్‌నగర్‌లో పుట్టి పెరిగారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్‌, ఫిలాసఫర్‌, ఎంటప్రిన్యూర్‌. విరించి గ్రూఫ్‌ ఫౌండర్‌ కొంపెల్ల విశ్వనాథ్‌‌ను 2001లో వివాహం చేసుకున్నారు. ఈదంపతులకు ముగ్గురు సంతానం.

ప్రస్తుతం మాధవిలత విరించి ఆస్పత్రి సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. కాగా.. ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవి లత.. తొలిసారిగా రాజకీయంగా.. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఆమె అనేక యూట్యూబ్‌ చానెల్స్‌కి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సోషల్‌ మీడియా సెలబ్రిటీగా నిలిచారు. ఇక ఇప్పుడు అసదుద్దీనపై పోటీ చేస్తూ.. రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి