iDreamPost
android-app
ios-app

ఆస్తి కోసం సొంత మనవడిని చంపిన తాతయ్య..

ఆస్తి కోసం సొంత మనవడిని చంపిన తాతయ్య..

నేటికాలంలో రక్తబంధాలకు విలువ లేకుండా పోతుంది. బంధాల కంటే నోట్ల కట్టలకే మనుషులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆస్తులు, డబ్బుల కోసం సొంత వారిని హతమారుస్తున్నారు. గత నెలలో ఆస్తి విషయంలో కట్టుకున్న భార్యనే రెంచితో కొట్టి మరీ చంపేశాడు ఓ వైద్యుడు. అలానే కొడలిని రాడ్డుతో దాడి చేసి చంపాడు ఓ మామ. ఇలా చెప్పుకుంటూ పోతే ధనం కారణంగా జరుగుతున్న ఘోరాలకు లెక్కేలేకుండా పోతుంది. తాజాగా సొంత మనువడిని తాతయ్య హత్య చేశాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తాతయ్యే  ఆ బాలుడిని కాటేశాడు.  ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమ గోదవారి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లూరు  గ్రామంలో ఈ దారుణం  చోటు చేసుకుంది. నాగేశ్వరరావు అనే వ్యక్తి తన కొడుకు కుటుంబతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. నాగేశ్వరావు కొడుకి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అయితే కొంతకాలం నుంచి  కొడుకు, కోడలి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒకసారి పెద్దల వద్ద పంచాయితీ పెట్టించారు. అనంతరం కొన్ని రోజుల పాటు మాములుగానే ఉన్నారు. కొన్ని రోజుల తరువాత మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో నాగేశ్వరావు కోడలు శిరీష.. భర్తతో విడిపోయేందుకు సిద్ధమైంది.  ఈ నేపథ్యంలో తమ ఆస్తి మనవడికి వెళ్తాయని నాగేశ్వరావు, ఆయన కుమారుడు భావించారు. ఆ ఆస్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడలకి చెందకూడదని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే పలుసార్లు నీ కొడుకును లేకుండా చేస్తాని.. తన మామ బెదరించినట్లు శిరీష ఆరోపించింది. ఇలా వారి గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే  ఈ నెల 9న మనవడిని  ఇంట్లో నుంచి బయటకు తీసికెళ్లిన నాగేశ్వరావు.. గొంత నులిమి చంపేశాడు. అనంతరం మనవడి డెడ్ బాడీని సమీపంలోని కాలువలో పడేసి.. ఏమి తెలియనట్లు ఇంటికి వచ్చాడు. తన కొడుకేడని కోడలు ప్రశ్నించగా బెదరించి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో తన కుమారుడు కనిపించడం లేదని శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. బాలుడిని నాగేశ్వరావు తీసుకెళ్లడం తాము చూసినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే సమీపంలోని కాలువలో బాలుడి డెడ్ బాడీ దొరికింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.  అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరి. ఆస్తుల ముందు రక్త సంబంధం ఓడిపోయిందని ఈ ఘటన చూసిన స్థానికులు అంటున్నారు. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: డాక్టర్ రాధ హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş