iDreamPost

రెండేళ్లలో 71 కేజీల బరువు తగ్గిన టెక్ సీఈవో! ఎలా అంటే..!

మనకళ్ల ముందే ఎంతో మంది అధిక బరువుతో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. కొందరు మాత్రం అద్భుతం చేసినట్లు స్లిమ్‌గా అయ్యిపోతారు. వాళ్లను చూడగానే భలే బరువు తగ్గారనిపిస్తుంది. అచ్చం అలానే హౌసింగ్‌ డాట్‌ కమ్‌ సీఈవో బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

మనకళ్ల ముందే ఎంతో మంది అధిక బరువుతో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. కొందరు మాత్రం అద్భుతం చేసినట్లు స్లిమ్‌గా అయ్యిపోతారు. వాళ్లను చూడగానే భలే బరువు తగ్గారనిపిస్తుంది. అచ్చం అలానే హౌసింగ్‌ డాట్‌ కమ్‌ సీఈవో బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

రెండేళ్లలో 71 కేజీల బరువు తగ్గిన టెక్ సీఈవో! ఎలా అంటే..!

నేటికాలంలో ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధ పడుతుంటారు. ఈ భారీ కాయం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువమంది మాత్రం బరువు తగ్గడంలో విఫలం అవుతుంటారు. కారణం.. బరువు తగ్గే విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో తిరిగి యథాస్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రెండేళ్లలోనే దాదాపు 70  కేజీలు తగ్గి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఓ టెక్ కంపెనీ సీఈఓ. ఆయన ఎలా బరువు తగ్గారో, ఆ వివరాలు తెలుసుకుందాం..

ప్రముఖ హౌసింగ్ డాట్ కామ్ కంపెనీకి ధ్రువ్ అగర్వాల్ సీఈవో గా పని చేస్తున్నారు. ఈయన కేవలం రెండేళ్లలోనే 70 కిలోల బరువు తగ్గి అందరికి స్పూర్తిగా నిలుస్తోంది. ఇక ఆయన వెయిట్ లాస్ కావడానికి చేసిన ప్రయత్నాల గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపడ మానం. 2021 నుంచి ధ్రువ్ అగర్వాల్ కు  గుండెపోటు, ఎసిడిట్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. ఈ  వ్యాధుల కారణంగా ఆయన తీవ్ర నరకం అనుభవించారు. బరువు ఉండటమే ఈ అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణమని ఆయన భావించారు. ఆ గుండె జబ్బు వంటి అనారోగ్య సమస్యల కారణంగానే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ఆ సమయంలో ధ్రువ్ అగర్వాల్ దాదాపు 151 కిలోలు బరువు ఉన్నాడు. ఆ టైంలో డయాబెటిక్‌, ఓవర్ కొలెస్ట్రాల్‌, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధ పడ్డారు.

ఈ నరకం భరించలేక.. ఎలాగైన బరువు తగ్గాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే మంచి ఫిట్ నెస్ ట్రైనర్ ను నియమించుకున్నారు. ఇక ఫిట్‌నెస్‌ నిపుణుడు సమక్షంలో రోజుకు రెండుసార్లు జిమ్ వర్కౌంట్స్ చేసేలా దృష్టి పెట్టారు. అలా రోజూ కిలోమీటర్లు చొప్పున నడక, కేలరీలు తక్కువుగా ఉన్నా ఆహారం తీసుకోవడం వంటివి చేశారు. రోజుకు దాదాపు 1700 కేలరీలను తగ్గిస్తూ వచ్చారు. తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్  గా ఉండే వారు. ఆల్కహాల్‌, ప్రాసెస్‌ చేసి, వేయించిన ఫుడ్ కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. మధ్యాహ్న భోజనంలో పప్పు, వండిన కూరగాయాలకే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చే వారు. రాత్రిపూట కాల్చిన చికెన్‌ లేదా చేపలతో సెలెరీ లేదా ఆస్పరాగస్‌ సూప్‌ వంటివి తీసుకునేవాడు. అలానే స్నాక్స్ గా గుమ్మడి గింజలు, అవిసె గింజలు, దోసకాయలు, క్యారెట్లు వంటి వాటిని తీసుకునే వాడు.

దీంతో ధ్రువ్‌ అనూహ్యంగా తన బరువులో సగానికి పైగా తగ్గిపోయాడు. ఇది అంతా కేవలం రెండేళ్లలోనే జరిగింది. తాను మరింతగా బరువు తగ్గేలా స్విమ్మింగ్‌, రన్నింగ్‌ వంటి వాటిపై కూడా దృష్టిపెట్టానని చెప్పాడు. తన వార్డ్‌బోర్డ్‌లో దుస్తులను మార్చి ఇష్టమైన ఫ్యాషన్‌ దుస్తులను ధరించడం చాలా అద్భుతంగా అనిపించని ధ్రువ్ తెలిపారు. ఏదీఏమైతేనేం అనారోగ్యం సమస్య ఆరోగ్యంపై శ్రద్ధ కలిగించి, బరువు తగ్గేలా చేసింది. అధిక బరువు కాదు సమస్య తగ్గాలనే పట్టుదల ఉండాలి. అది ఉంటే బరువు తగ్గడం అనేది అసలు సమస్యే కాదని ధ్రువ్‌ చేసి చూపించారు. మరి.. బరువుతో బాధ పడుతున్న ఎంతో మందికి ఈయన స్ఫూర్తిగా నిలిచారు. మరి.. ఈ టెక్ సీఈఓపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి