iDreamPost

మీ ఆహారంలో ఉప్పును బాగా ఎక్కువగా తీసుకుంటారా? – తస్మాత్ జాగ్రత్త!!

మీ ఆహారంలో ఉప్పును బాగా ఎక్కువగా తీసుకుంటారా? – తస్మాత్ జాగ్రత్త!!

మనం తినే పదర్థాల్లో సరైన మోతాదులో ఉప్పు పడితే.. ఆ టేస్టే వేరు అనుకుంటూ తినేస్తూ ఉంటాం. అయితే ఉప్పును ఎక్కువగా తినడం వల్ల ఏకంగా ఆయుర్ధాయమే తగ్గుతందని అంటున్నారు పరిశోధకులు.

తినే టేబుల్ దగ్గర ఉప్పును జోడించడం దాదాపు చావును కొని తెచ్చుకోవడమేనని చెప్తున్నారు. ఆహారానికి ఉప్పును జోడించడం వల్ల పురుషులకు రెండు సంవత్సరాలు, మహిళలకు ఒకటిన్నర సంవత్సరాల కంటే ఎక్కువ ఆయుర్దాయం తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. 5,00,000 మంది మధ్య వయస్కులైన వారిపై సర్వే జరిపిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.

ఉప్పు వినియోగం సాధారణంగా తక్కువ ఆరోగ్యకరమైన జీవనశైలిని సూచిస్తుందని న్యూ ఓర్లీన్స్ లోని టులేన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కు చెందిన ప్రొఫెసర్ లూ క్వి చెప్పారు.

 

adding salt in food_

 

యుకె బయోబ్యాంక్ అధ్యయనంలో జరిగిన ఈ సర్వేలో 5లక్షల మంది పాల్గొన్నారు. 2006 మరియు 2010 మధ్య అధ్యయనంలో ఎంత తరచుగా తమ ఆహారంలో ఉప్పును జోడించారో ఈ సర్వేలో తెలుసుకొగలిగారు. సోడియంను  తీసుకోవడంలో ఒక మోస్తరు తగ్గింపు అంటే, టేబుల్ వద్ద ఆహారానికి తక్కువ లేదా ఉప్పును జోడించడం ద్వారా, గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుందని వెల్లడించారు.

వయస్సు, లింగం, జాతి, కొరత, బాడీ మాస్ ఇండెక్స్, ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ, ఆహారం మరియు మధుమేహం, క్యాన్సర్ మరియు గుండె జబ్బులు వంటి వైద్య పరిస్థితులతో సహా ఫలితాలను ప్రభావితం చేసే ఇతర కారకాలును సైతం ఈ సర్వేలో లెక్కించారు.

పాశ్చాత్య దేశాల్లో 70% ప్రాసెస్ చేయబడిన మరియు తయారు చేసిన ఆహారాల్లో సోడియం ఉంటుంది. ఇందుకు అదనంగా తినే టేబుల్ దగ్గర 8-20% వరుకు ఆహారంలో మరోసారి ఉప్పును జోడిస్తారు. ఈ ప్రక్రియ చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ఉప్పును వీలైనంతగా తగ్గించాలని.. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో అదనంగా ఉప్పును జోడించడం తగ్గించాలని కోరుతున్నారు. పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉప్పును సమతుల్యం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి