iDreamPost

30 దాటినా పెళ్లికి నో.. యూత్‌ వారి ట్రాప్‌లో పడిపోతోంది!

30 దాటినా పెళ్లికి నో.. యూత్‌ వారి ట్రాప్‌లో పడిపోతోంది!

పెళ్లంటే ఒకప్పుడు నూరేళ్ల పంటగా ఉండేది. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన జంటలు ఒకరినొకరు అర్థం చేసుకునో.. లేదా అవసరం కోసమో కలిసి జీవించే వారు. ముఖ్యంగా తమ కోసం కంటే.. సమాజం కోసం బతికే వారే ఎక్కువ మంది ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. కలిసి జీవించటం కష్టం అనుకున్నప్పుడు విడాకులు తీసుకుని వేరుపడుతున్న జంటలే సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే యువత పెళ్లి చేసుకోవాలంటే భయపడుతోంది. 30 వయసు దాటినా పెళ్లి మీదకు చూపు పోనివ్వటం లేదు.

పెళ్లి కంటే ఎక్కువ సింగిల్‌ లైఫ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకరకంగా ఉద్యోగాలనే తమ భార్యలుగా భావిస్తున్నారు. పెళ్లిని కాదని ఉద్యోగంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. సింపుల్‌గా ‘ఇప్పుడే పెళ్లికి తొందర ఏమొచ్చింది’అంటున్నారు. వైవాహిక జీవితం మీద కంటే ఉద్యోగం మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ‘సే నోటు మ్యారెజ్‌’ అన్న నినాదాన్ని వెలుగొత్తి చాటి చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకోకుండా సింగిల్‌ లైఫ్‌ లీడ్‌ చేయాలనుకునే యువతే ఎక్కువగా ఉండటం గమనార్హం.

దీనిపై ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘‘ అమెరికాలో ఓ ట్రాప్‌ తయారైంది. అక్కడి పలు బహుళజాతి కంపెనీలు మన ఇండియన్‌ యూత్‌పై ఆ ట్రాప్‌ను వేస్తున్నాయి. తమ కంపెనీలకు మనవాళ్లను బానిసలుగా చేసుకుంటున్నాయి. అమెరికా వెళ్లిన ఇండియన్స్‌ ఆ ట్రాప్‌లో పడిపోతున్నారు. పెళ్లి చేసుకోవటానికి వెనకడుగు వేస్తున్నారు. వివాహ వ్యవస్థను దెబ్బ తియ్యాలని ఒకప్పుడు చైనా పెద్ద కుట్ర చేసింది. పెళ్లి కారణంగా స్వార్థం పెరుగుతుందంటూ రెచ్చగొట్టింది. కమ్యూనిజాన్ని తెరపైకి తెచ్చింది. అయితే, ఆ ప్రయత్నాలు పని చేయలేదు. ఇప్పుడు క్యాపిటలిస్ట్‌ అమెరికా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది’’ అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి