iDreamPost
android-app
ios-app

వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు! ఫాలో అయిపోండి..

  • Published Jul 21, 2023 | 11:14 AM Updated Updated Jul 21, 2023 | 11:14 AM
  • Published Jul 21, 2023 | 11:14 AMUpdated Jul 21, 2023 | 11:14 AM
వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు! ఫాలో అయిపోండి..

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అంటువ్యాధులు విజృంభిస్తాయి. కలుషిత నీటి కారణంగానే ఎక్కువ జబ్బులు వస్తూ ఉంటాయి. అంతేకాదు! వర్షాల కారణంగా వాతావరణం మొత్తం చల్లగా మారుతుంది. దీంతో వ్యాధులు చాలా ఈజీగా మనుషులపై దాడి చేస్తాయి. దోమలు కూడా తమ పంజా విసురుతూ ఉంటాయి. ఇక, ఈ వర్షాకాలంలో ఎక్కువగా టైఫాయిడ్‌, మలేరియాతో పాటు ఇతర అంటు వ్యాధులు వస్తూ ఉంటాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. లేదంటే లేని పోని ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది. వర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఈ టిప్స్‌ పాటించండి!

  • రోగాల నుంచి మన శరీరం తట్టుకోగలగాలి అంటే.. వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. అందుకే.. ఆహారంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలను భాగం చేసుకోవాలి. అల్లం టీ, వెల్లుల్లి సూపు వంటివి తాగుతూ ఉండాలి.
  • వర్షాకాలంలో ఎక్కువగా కూరగాయలు తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా చేదుగా ఉండే కూరగాయల్ని తినటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతీ రోజూ చేదు కూరగాయల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • వర్షాకాలంలో రోగాలు రావటానికి ప్రధాన కారణం నీరు. అందుకే.. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. అది కూడా గోరు వెచ్చగా ఉన్న నీటిని తీసుకోవటం ఉత్తమం.
  • వర్షాకాలంలో పాల ఉత్పత్తులను కూడా తగినంతగా తీసుకోవాలి. పాలు అజీర్తిని కలుగజేస్తాయి కాబట్టి.. యోగార్ట్‌, కాటేజ్‌ చీజ్‌, బట్టర్‌ మిల్క్‌ వంటివి తీసుకోవాలి.
  • వర్షా కాలంలోనే కాదు.. ఏ కాలంలోనైనా పండ్లను తినటం మంచిదే. కానీ, వర్షాకాలంలో కొన్ని పండ్లను తినకపోవటం కొంత మేలు చేస్తుంది. ముఖ్యంగా పుచ్చకాయను తినటం ఆపాలి.
  • వర్షాకాలంలో కడుపుపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే ఏవి పడితే అవి తినటం మానాలి. ముఖ్యంగా మసాలాలకు దూరంగా ఉండాలి.
  • వర్షాల్లో తడవటం అంత మంచిది కాదు. బయటకు వెళ్లే టప్పుడు వర్షం పడుతున్నా లేకపోయినా.. గొడుగును క్యారీ చేయాలి.
  • దోమల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దోమ కాయిల్స్‌, ఆల్‌ ఔట్‌ వంటివి వాడాలి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet