iDreamPost

మరో ప్రముఖ మసాలా పై బ్యాన్..దీన్ని తిన్నారంటే క్యాన్సర్‌

  • Published Apr 22, 2024 | 7:09 PMUpdated Apr 22, 2024 | 7:09 PM

ఇటీవలే ఇండియాకు చెందిన ప్రముఖ కంపెనీ మసాలా ఉత్పత్తుల పై విదేశాల్లో ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే ఎవరెస్ట్ ఫిష్ కర్రి మసాలాపై సింగపూర్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో మసాలా కంపెనీ పై ఆ దేశంలో నిషేధం విధించారు.

ఇటీవలే ఇండియాకు చెందిన ప్రముఖ కంపెనీ మసాలా ఉత్పత్తుల పై విదేశాల్లో ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే ఎవరెస్ట్ ఫిష్ కర్రి మసాలాపై సింగపూర్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో మసాలా కంపెనీ పై ఆ దేశంలో నిషేధం విధించారు.

  • Published Apr 22, 2024 | 7:09 PMUpdated Apr 22, 2024 | 7:09 PM
మరో ప్రముఖ మసాలా పై బ్యాన్..దీన్ని తిన్నారంటే క్యాన్సర్‌

భారతదేశంలోని ప్రముఖ బ్రాండెడ్ మసాలా ఉత్పత్తులపై విదేశాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే పాపులర్ మసాలా బ్రాండ్ లో ఒకటి అయిన ఎవరెస్ట్ కి ఊహించని గట్టి షాక్ తగిలింది. కాగా, భారత్ లో తయారైన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలలో పురుగుమందు అవశేసాలు అధిక స్థాయిలో ఉన్నాయని సింగ్ పూర్ ఆరోపించింది.  అలాగే ఈ మసాలా మిశ్రమంలో మానవ వినియోగానికి పనికిరాని పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందని గుర్తించిన హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ.. ప్రతిస్పందనగా చర్య తీసుకున్నట్టు ఈమేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ఇక అందులో  ఫిష్ మసాలాలో పరిమితులు దాటి ఇథిలిన్ ఆక్సైడ్ ఉందని హైలైట్ చేసింది. అయితే భారత్‌లో తయారైన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయిలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నాయని హాంకాంగ్‌లోని వెంటనే రీకాల్ చేయాలని సింగ్‌పూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) నిన్న అనగా గురువారం ఏప్రిల్ 18న ఓ ప్రకటనలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఎవరెస్ట్ తో పాటు మరో మసాలా కంపెనీ పై హాంకాంగ్ వేటు వేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే ఇండియాకు చెందిన ప్రముఖ కంపెనీ మసాలా ఉత్పత్తుల పై విదేశాల్లో ఊహించని షాక్ తగులుతుంది. మొన్ననే ఎవరెస్ట్ ఫిష్ కర్రి మసాలాపై సింగపూర్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎవరెస్ట్ తోపాటు మరో కంపెనీపై హాంకాంగ్ నిషేధిత వేటును విధించింది.తాజాగా హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేప్ట(సీఎస్ఎఫ్) అథారిటీ విభాగం ఏప్రిల్ 5న నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఎండీహెచ్ గ్రూప్ తయారు చేసిన మసాల దినుసులైన.. మద్రాస్ కర్రీ ఫౌడర్, సాంబార్ మసాల్ ఫౌడర్, కర్రీ ఫౌడర్ లలో ఇథిలిన్ ఆక్సైడ్ గుర్తించామని అధికారికంగా ప్రకటించింది. కాగా, హాంకాంగ్ దేశం యౌ సిమ్ మోంగ్ రాష్ట్రంలో.. ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్ షా సుయ్ లో మూడు ఎండీహెచ్‌ అవుట్‌లెట్‌లలో సీఎస్‌ఎఫ్‌ తనిఖీలు చేయగా ఆ మసాల దినుసుల్లో పురుగుమందులు, ఇథిలీన్‌ ఆక్సైడ్‌లు ఉన్నట్లు తేలింది.దీంతో వెంటనే ఆ మంటల దినుసుల అమ్మకాల్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది.

ఇక ఇప్పటికే ఎవరెస్ట్‌ గ్రూప్‌ తయారు చేసిన ఫిష్‌ కర్రీ మసాల దినుసుల్లో సైతం పురుగుమందుల్ని గుర్తించి వాటిని నిలిపివేస్తున్నట్లు జారీ చేసిన విషయం విధితమే. అయితే మళ్లీ ఇప్పడు ఎండీహెచ్ గ్రూప్ మసాల ఫౌడర్స్ లో కూడా హానికరమైన పురుగుమందు ఉన్నట్లు నిర్ధనమైంది. దీని ఫలితంగా హాంగ్‌కాంగ్‌, సింగ్‌పూర్‌ దేశాలు భారత్‌ మసాలా దినుసుల తయారీ కంపెనీలు ఆరోగ్యానికి హానికరమైన మసాలా దినుసుల్ని రీకాల్‌కు ఆదేశించింది. ఇక ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను ఇప్పటికే ప్రజలకు వాడొద్దని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సూచించింది. కాగా, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌లో (డబ్ల్యూహెచ్‌ఓ) భాగమైన ఇంటర్నేషన్‌ ఏజెన్సీ ఫర్‌ రిసెర్చ్‌ (ఐఏఆర్‌సీ) క్యాన్సర్‌పై రీసెర్చ్‌ చేస్తుంది. ఆ ఏజెన్సీ పరిశోధనల్లో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. మరి, ఎవరెస్ట్ మసాలా ఫౌడర్స్ తో ఎండీహెచ్ మసాలాలను సింగపూర్ లో బ్యాన్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి