iDreamPost

Bank ఖాతాదారులకు అలర్ట్.. ఆ 2 రోజులు ఆ సేవలన్నీ బంద్

ఆ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆ రెండు రోజులు ఆ సేవలన్నీ బంద్ కానున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు తన కస్టమర్లకు సందేశాలను పంపిస్తున్నది.

ఆ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆ రెండు రోజులు ఆ సేవలన్నీ బంద్ కానున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు తన కస్టమర్లకు సందేశాలను పంపిస్తున్నది.

Bank ఖాతాదారులకు అలర్ట్.. ఆ 2 రోజులు ఆ సేవలన్నీ బంద్

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక బ్యాంక్ కస్టమర్లకు సేవలన్నీ సులువైపోయాయి. బ్యాంకులకు వెళ్లకుండానే చాలా వరకు పనులు జరిగిపోతున్నాయి. ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకులన్నీ మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలను అందిస్తున్నాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులకు సమయం ఆదాతో పాటు తక్కువ సమయంలోనే పనులన్నీ జరిగిపోతున్నాయి. అయితే అప్పుడప్పుడు ఆన్ లైన్ సేవల్లో అంతరాయం కలిగితే మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది బ్యాంక్ కస్టమర్లు. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ తన కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఆ రెండు రోజులు ఆ సేవలన్నీ బంద్ కానున్నట్లు తెలిపింది.

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తమ కస్టమర్లకు అలర్ట్ ఎస్ఎంఎస్‌లు పంపిస్తోంది. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు తమ బ్యాంక్ సేవలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పలు సర్వీసుల్లో అంతరాయం కలగనున్నట్లు వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ఈనెల జూన్ 9వ తేదీతో పాటు జూన్ 16వ తేదీన మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ సేవలు నిలిచిపోనున్నాయని తెలిపింది. జూన్ 9వ తేదీన ఉదయం 3.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. జూన్ 16న ఉదయం 3.30 గంటల నుంచి ఉదయం 7.30 గంటల వరకు ఈ సేవలు నిలిచిపోనున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆన్ లైన్ సేవల్లో అంతరాయం కారణంగా ఖాతాదారులు తమకు డబ్బులు అవసరం అయితే ముందుగానే ఇతర అకౌంట్లోకి పంపించుకుంటే అత్యవసరమైనప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రెండ్రోజుల్లో బ్యాంకు ప్రకటించిన సమయాల్లో డిపాజిట్లు, ఫండ్ ట్రాన్స్‌ఫర్ కోసం ఉపయోగించే ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ సేవలు, అకౌంట్ స్టేట్మెంట్ డౌన్‌లోడ్లు, మర్చంట్ పేమెట్ సర్వీసెస్, ఇన్‌స్టాంట్ అకౌంట్ ఓపెనింగ్, యూపీఐ పేమెంట్లు నిలిచిపోనున్నాయి. అయితే ఆన్ లైన్ సేవల్లో అంతరాయం కలిగినప్పటికీ అత్యవసరమైన బ్యాంక్ పనులు ఉంటే బ్యాంకులకు వెళ్లి పరిష్కరించుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి