iDreamPost

హార్దిక్ పాండ్యాను డబ్బుల కోసమే వదులుకుంటున్నారా? గుజరాత్ ప్లాన్ ఏంటి?

  • Author singhj Published - 10:03 AM, Sat - 25 November 23

స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ఇప్పుడు వార్తల్లో బాగా వినిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అతడ్ని వదులుకోవాలని డిసైడ్ అవ్వడమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ఇప్పుడు వార్తల్లో బాగా వినిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అతడ్ని వదులుకోవాలని డిసైడ్ అవ్వడమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

  • Author singhj Published - 10:03 AM, Sat - 25 November 23
హార్దిక్ పాండ్యాను డబ్బుల కోసమే వదులుకుంటున్నారా? గుజరాత్ ప్లాన్ ఏంటి?

వరల్డ్ కప్-2023 ముగియడంతో ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్ పట్టుకుంది. ఈ మెగా లీగ్ కొత్త సీజన్ మొదలయ్యేందుకు మరో 4 నెలల టైమ్ ఉంది. కానీ ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ట్రేడింగ్ విండో కూడా ముగుస్తుండటంతో ఇప్పుడంతా ఐపీఎల్​ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏయే ప్లేయర్లను ఫ్రాంచైజీలు వదులుకుంటాయి? ఏ ఆటగాళ్లను ఎవరు రీటేన్ చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈసారి ట్రేడింగ్ విండో ఇంతగా వార్తల్లో నిలవడానికి కారణం హార్దిక్ పాండ్యా అనే చెప్పాలి. ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్​కు పాండ్యా కెప్టెన్​గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి రిటెన్షన్​లో భాగంగా అతడు తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం దాదాపుగా ఖాయమైందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

హార్దిక్ పాండ్యా రిటెన్షన్​కు సంబంధించి అటు గుజరాత్ టైటాన్స్ గానీ ఇటు ముంబై ఇండియన్స్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్లేయర్లను మార్చుకోవడానికి ఫ్రాంచైజీలకు ఆదివారం వరకు గడువు ఉంది. దీంతో అప్పటిలోగా దీని మీద క్లారిటీ వచ్చే ఛాన్స్ లేనట్లే. కానీ హార్దిక్​ గురించి ముంబైతో గుజరాత్ చర్చలు జరిపిందట. అతడు ఫ్రాంచైజీ మారడం దాదాపుగా ఓకే అయిందట. ఇంకా అగ్రిమెంట్ కానప్పటికీ ఈ విషయంపై రెండు ఫ్రాంచైజీలు పాజిటివ్​గా ఉన్నాయని.. పాండ్యా ముంబైకి వెళ్లడం ఫిక్స్ అని సమాచారం. అయితే హార్దిక్ సొంతగూటికి తిరిగొస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడతాడా? లేదంటే అతడ్నే కెప్టెన్​ చేస్తారా? అన్నది ఇంట్రెస్టింగ్​గా మారింది.

హార్దిక్ పాండ్యా స్థానంలో గుజరాత్ టైటాన్స్​కు యంగ్ క్రికెటర్ శుబ్​మన్ గిల్ కెప్టెన్​గా సెలక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే రిటెన్షన్​లో భాగంగా హార్దిక్‌ కోసం ముంబై చెల్లిస్తున్న వ్యయం ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఈ స్టార్ ఆల్​రౌండర్ కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. హార్దిక్​ను తమకు ఇచ్చినందుకు గుజరాత్​కు పదిహేను కోట్లు ఇవ్వడానికి ముంబై ఇండియన్స్ ఓకే చెప్పిందట. అయితే పాండ్యాకు బదులు ముంబై నుంచి డబ్బులు మాత్రమే తీసుకుంటున్న గుజరాత్.. బదులుగా అటు నుంచి మరో ప్లేయర్​ను తీసుకునేందుకు మాత్రం నో చెప్పిందట. హార్దిక్​ను ఇస్తున్నందుకు బదులుగా తమకు డబ్బులు ఇస్తే చాలని చెప్పిందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

హార్దిక్ పాండ్యా విషయంలో గుజరాత్ టైటాన్స్ వ్యవరిస్తున్న తీరు కాస్త వింతగా అనిపిస్తోందని చెప్పాలి. ఐపీఎల్​లో గుజరాత్​కు కెప్టెన్​గా ఉన్న అతను.. ఒకసారి టీమ్​కు కప్​ అందించాడు. మరోమారు జట్టును ఫైనల్​కు తీసుకెళ్లాడు. బ్యాటింగ్, బౌలింగ్​లో రాణిస్తూ జట్టును ముందుండి లీడ్ చేశాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఇంత సక్సెస్ రేట్ ఉన్న పాండ్యాను గుజరాత్ ఎందుకు వదులుకుంటోందో ఎవరికీ అర్థం కావడం లేదు. అందునా టీమ్​కు కెప్టెన్ అయిన ప్లేయర్​ను ఎందుకు ముంబైకి ఇస్తోందో అంతు చిక్కడం లేదు. కేవలం డబ్బుల కోసమే అతడ్ని వదులుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గిల్​ను కెప్టెన్​ చేసి.. హార్దిక్​ రిటెన్షన్​తో వచ్చే డబ్బులతో మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లను తీసుకోవాలనేది ఆ జట్ట ప్లాన్ అని కొందరు అనలిస్టులు అంటున్నారు. గుజరాత్ యాజమాన్యానికి పాండ్యాకు పొసగట్లేదని.. అందుకే ఈ రిటెన్షన్ తెర మీదకు వచ్చిందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. మరోవైపు టీమ్ కెప్టెన్సీని కాదనుకొని గుజరాత్​ నుంచి ముంబైకి హార్దిక్ ఎందుకు వెళ్లిపోతున్నాడనేదీ అర్థం కావడం లేదు. మరి.. పాండ్యా గుజరాత్​ను వదిలి వెళ్తున్నాడనే వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ ఆల్​రౌండర్.. బాబర్​తో ఫైటే కారణమా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి