Nidhan
ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోమారు ట్రోలింగ్‌కు గురయ్యాడు. రోహిత్ శర్మ చేసిన సాయాన్ని అతడు మర్చిపోవడమే దీనికి కారణమని చెప్పాలి.
ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోమారు ట్రోలింగ్‌కు గురయ్యాడు. రోహిత్ శర్మ చేసిన సాయాన్ని అతడు మర్చిపోవడమే దీనికి కారణమని చెప్పాలి.
Nidhan
ఐపీఎల్-2024 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడియెన్స్ మరికొన్ని గంటలు ఆగితే చాలు. శుక్రవారం నుంచి పొట్టి లీగ్ సందడి మొదలుకానుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్‌కు తెరలేవనుంది. ఈసారి ట్రోఫీ మీద కన్నేసిన ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం జరగనుంది. దీంతో ప్రిపరేషన్స్‌లో మరింత వేగం పెంచింది ముంబై టీమ్. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తదితరులు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ తరుణంలో పాండ్యాపై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. హార్దిక్ బుద్ధి మారలేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శిస్తున్నారు.
పాండ్యా మీద ట్రోలింగ్‌కు కారణం రోహిత్ చేసిన సాయాన్ని అతడు విస్మరించడమే. ఇవాళ్టి నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో తాజాగా హార్దిక్ ట్విట్టర్లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఇది తనకు 10వ ఐపీఎల్ సీజన్ అని.. ఇంతవరకు సాగిన ఈ జర్నీలో తనకు సహకరించిన వారికి, తాను ఈ స్థాయికి ఎదగడంలో కీలకపాత్ర పోషించిన వారికి రుణపడి ఉంటానన్నాడు. తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉండే ముంబై ఇండియన్స్‌లోకి మళ్లీ రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు పాండ్యా. ఐపీఎల్ వల్లే ఇంత గుర్తింపు దక్కిందని లేకపోతే బరోడాలోనే తాను ఉండిపోయేవాడ్ని అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ పోస్టులో గానీ వీడియోలో గానీ ఎక్కడా రోహిత్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పాండ్యా.
టీమ్‌లో అనామకుడిగా ఉన్న హార్దిక్‌కు అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు హిట్‌మ్యాన్. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు పాండ్యా పదే పదే ఫెయిలైన సమయంలో అతడ్ని వదులుకునేందుకు ఫ్రాంచైజీ సిద్ధమైంది. ఆ టైమ్‌లో కూడా హార్దిక్ టాలెంట్‌పై నమ్మకం ఉంచి అతడ్ని టీమ్‌లో కంటిన్యూ అయ్యేలా చేశాడు. ఐపీఎలే కాదు టీమిండియాలో కూడా అతడి ప్లేస్ ఫిక్స్ అవడంలో హిట్‌మ్యాన్ కీలకపాత్ర పోషించాడు. అయినా తన పోస్టులో, వీడియోలో ఐపీఎల్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. కానీ ఎక్కడా రోహిత్ ప్రస్తావన తీసుకురాలేదు పాండ్యా. అతడి పేరు చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఉంటే బాగుండేది.
రోహిత్ ప్రస్తావన తీసుకొస్తే ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషించేవారు. అలాగే తనకు ఇచ్చిన సపోర్ట్‌కు హార్దిక్ రుణం తీర్చుకున్నట్లు ఉండేది. కానీ పాండ్యా అలా చేయకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. హార్దిక్ బుద్ధి మారలేదని.. రోహిత్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాననే విషయం అతడు మర్చిపోయాడని అంటున్నారు. కెప్టెన్సీ విషయంలో అవమానించిందే గాక ఇప్పుడు క్రెడిట్స్ ఇవ్వకుండా, కనీసం హిట్‌మ్యాన్ పేరెత్తకుండా తన నీచ బుద్ధి మరోమారు చూపించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్-హార్దిక్ వ్యవహారంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In my 10th IPL season, grateful for the journey, for the growth, for everything that’s come my way 🙏 And to be back with a team that’s always been in my heart 💙 pic.twitter.com/vNnT6XVefH
— hardik pandya (@hardikpandya7) March 22, 2024