iDreamPost
android-app
ios-app

Hardik Pandya: ముంబై ఇండియన్స్ సంచలన ప్రకటన! కెప్టెన్​గా హార్దిక్ పాండ్యా!

  • Published Dec 15, 2023 | 6:17 PM Updated Updated Dec 15, 2023 | 6:51 PM

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అంశం గత కొన్నాళ్లుగా వార్తల్లో ఒకటిగా ఉంది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్​లో దక్కించుకున్నప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై సంచలన ప్రకటన చేసింది.

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అంశం గత కొన్నాళ్లుగా వార్తల్లో ఒకటిగా ఉంది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్​లో దక్కించుకున్నప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై సంచలన ప్రకటన చేసింది.

  • Published Dec 15, 2023 | 6:17 PMUpdated Dec 15, 2023 | 6:51 PM
Hardik Pandya: ముంబై ఇండియన్స్ సంచలన ప్రకటన! కెప్టెన్​గా హార్దిక్ పాండ్యా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో భారీ ఫ్యాన్​ బేస్ కలిగిన టీమ్స్​లో ఒకటి ముంబై ఇండియన్స్​. ఐదుసార్లు టైటిల్ విన్నర్​గా నిలిచిన ఈ ఫ్రాంచైజీ మీద ప్రతి సీజన్​లోనూ ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్ ఉంటాయి. వచ్చే సీజన్​లోనూ ఈ టీమ్ ఫేవరెట్​గానే బరిలోకి దిగనుంది. అయితే గత కొన్నాళ్లుగా ముంబై కెప్టెన్సీ అంశం వార్తల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ టీమ్ నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే దాని మీద నెట్టింట కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందరికీ షాకిచ్చింది ముంబై ఇండియన్స్. తమ జట్టు కొత్త కెప్టెన్​గా టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించింది. ఈ మేరకు ఎంఐ ఇన్​స్టాగ్రామ్​లో అధికారికంగా ఒక పోస్ట్ పెట్టింది. వచ్చే సీజన్​కు నాయకత్వంలో మార్పులు చేస్తున్నామని.. పాండ్యాను నూతన సారథిగా నియమించామని ప్రకటించింది.

మోస్ట్ సక్సెస్​ఫుల్ కెప్టెన్స్​లో ఒకడైన రోహిత్ శర్మ నుంచి హార్దిక్​కు కెప్టెన్సీ పగ్గాలను బదిలీ చేస్తున్నామని ఇన్​స్టా పోస్టులో ముంబై ఇండియన్స్ తెలిపింది. టీమ్ ఫ్యూచర్​ను బిల్డ్ చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మహేళ జయవర్దనే తెలిపాడు. సచిన్ టెండూల్కర్ నుంచి హర్భజన్ సింగ్ వరకు.. రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ వరకు ఎంతో మంది అద్భుతమైన కెప్టెన్లు ఫ్రాంచైజీకి సేవలు అందించారని మెచ్చుకున్నాడు. టీమ్​ను గెలిపిస్తూనే భవిష్యత్​ కోసం కూడా వాళ్లు కృషి చేశారని జయవర్దనే చెప్పుకొచ్చాడు. వచ్చే సీజన్ నుంచి ముంబై టీమ్​ను, ఫ్రాంచైజీ లెగసీని హార్దిక్ ముందుకు తీసుకెళ్తాడని పేర్కొన్నాడు. ఇన్నాళ్లూ కెప్టెన్​గా ఉన్న రోహిత్ శర్మకు జయవర్దనే కృతజ్ఞతలు తెలిపాడు. అతడి లీడర్​షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు.

2013 నుంచి ఇప్పటిదాకా ముంబై టీమ్​ను రోహిత్ సూపర్బ్​గా నడిపించాడని జయవర్దనే మెచ్చుకున్నాడు. ఇక మీదట కూడా అతడు కీలకమైన సూచనలు ఇస్తూ తన ఎక్స్​పీరియెన్స్​ను టీమ్​కు అందిస్తాడని వివరించాడు. ఇక, పాండ్యాను కొత్త కెప్టెన్​గా నియమిస్తూ ముంబై తీసుకున్న నిర్ణయం విని క్రికెట్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. మరో మూడ్నాలుగేళ్లు ఈజీగా టీమ్​ను నడిపించే సత్తా రోహిత్​కు ఉందని.. అతడ్ని కెప్టెన్సీ నుంచి తీసేయడం సరికాదని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే హిట్​మ్యాన్​ గైడెన్స్​లో హార్దిక్​ కెప్టెన్సీలో రాటుదేలుతాడని.. టీమ్ ఫ్యూచర్ కోసం కఠిన నిర్ణయం తీసుకోవడం మంచిదేనని మరికొందరు నెటిజన్స్ ముంబైకి సపోర్ట్ చేస్తున్నారు. మరి.. ముంబై కొత్త కెప్టెన్​గా హార్దిక్ పాండ్యాను నియమించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Suryakumar Yadav: టెన్షన్​లో ఫ్యాన్స్.. ఇంజ్యురీపై అప్​డేట్ ఇచ్చిన సూర్యకుమార్!

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)