iDreamPost

Maruti Jimny: మంచి ఆఫ్ రోడ్ వెహికల్ కొనాలా? జిమ్నీపై లక్షల్లో డిస్కౌంట్!

మారుతీ కంపెనీకి చెందిన కార్లు బడ్జెట్ ధరలోనే ఉంటాయి. ఇప్పుడు మంచి ఆఫ్ రోడ్ కారుపై కంపెనీ లక్షల్లో డిస్కౌంట్ అందిస్తోంది.

మారుతీ కంపెనీకి చెందిన కార్లు బడ్జెట్ ధరలోనే ఉంటాయి. ఇప్పుడు మంచి ఆఫ్ రోడ్ కారుపై కంపెనీ లక్షల్లో డిస్కౌంట్ అందిస్తోంది.

Maruti Jimny: మంచి ఆఫ్ రోడ్ వెహికల్ కొనాలా? జిమ్నీపై లక్షల్లో డిస్కౌంట్!

కారు కొనాలి అని ఫిక్స్ అవ్వడానికి ముందు మీ అవసరాలు ఏంటో మీకు తెలియాలి. ఎందుకోసం కారు కొనాలి అనుకుంటున్నారో క్లారిటీ ఉండాలి. తమ తమ అవసరాలను బట్టి హ్యాట్చ్ బ్యాక్, సెడాన్, ఎస్ యూవీ, ఆఫ్ రోడ్ వెహికల్స్ కూడా కొంటూ ఉంటారు. అయితే మీ అవసరాన్ని మీకు ఒక మంచి ఆఫ్ రోడ్ వెహికల్ కావాలి అంటే ఇదే మంచి తరుణం అని చెప్పాలి. ఎందుకంటే మారుతీ జిమ్మీపై ఏకంగా లక్షల్లో డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలే గానీ.. ప్రస్తుతానికి అయితే జిమ్మీ రెండు వేరియంట్లపై మంచి డిస్కౌంట్స్ అందిస్తున్నారు. మరి.. ఆ కారు ఫీచర్స్ ఏంటి? ఆ ధరకు కొనడం మంచిదేనా? తెలుసుకుందాం.

మారుతీ నుంచి ఉన్న కార్లలో జిమ్మీ మంచి ఆఫ్ రోడ్ కారు అనే చెప్పాలి. ప్రస్తుతం జిమ్మీలో రెండు వేరియంట్స్ ఉన్నాయి. జమ్నీ జెటా, జిమ్మీ ఆల్ఫా అనే వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు జిమ్మీ థండర్ ఎడిషన్ అంటూ లిమిటెడ్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ జిమ్మీ అమ్మకాలు మందకొండిగా సాగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 15,476 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ జిమ్మీ కారు ధరలు చూస్తే.. జెటా మోడల్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.74 లక్షలు, ఆటోమేటిక్ ట్రాన్సిషన్ ఎక్స్ ఫోరూమ్ ధర రూ.13.94 లక్షలుగా ఉన్నాయి. అలాగే జిమ్మీ ఆల్ఫా మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ధర రూ.13.69 లక్షలుగా.. ఆటోమేటిక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.15.05 లక్షలుగా ఉంది.

discount on jimmy cars

ముఖ్యంగా ఈ మోడల్ కు ధర పెద్ద సమస్యగా మారింది. ఇదే ప్రైస్ రేంజ్ లో మహీంద్రా థార్ అందుబాటులో ఉండటం దీనికి పెద్ద అడ్డంకి అయ్యింది. అందుకే ఆ అడ్డంకిని అధిగమించి.. అమ్మకాలను గాడిలో పెట్టేందుకు ధరలో కోత విధిస్తోంది. ఇప్పుడు రెండు వేరియంట్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. జిమ్మీ జెటా మోడల్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ని ఇస్తున్నారు. ఏకంగా రూ.2.21 లక్షల వరకు ధరలో డిస్కౌంట్ ని అందిస్తున్నారు. అలాగే ఆల్ఫా మోడల్ పై కూడా రూ.1.21 లక్షల వరకు డిస్కౌంట్స్ ని అందిస్తున్నారు. థండర్ ఎడిషన్ ధర చూస్తే.. రూ.10.74 లక్షలుగా ఉంది. ఇంక డిస్కౌంట్స్ తర్వాత జిమ్మీ ధరలు భారీగా తగ్గాయనే చెప్పాలి. మరోవైపు థార్ ప్రైస్ రేంజ్ కి దగ్గరగా వచ్చింది. అయితే ఈ డిస్కౌంట్స్ జిమ్మీ అమ్మకాలపై ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి మరి.

జిమ్మీ స్పెసిఫికేషన్స్:

ఈ 4 సీటర్ జిమ్మీ కారు 1.5 లీటర్ 1462సీసీ 4 సిలిండర్ పవర్ ఫుల్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఒక మంచి ఆఫ్ రోడ్ వెహికల్ అనే బిరుదుకు ఏమాత్రం తీసిపోకుండా ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 105 పీఎస్ పవర్, 134 ఎన్ఎం టార్క్ ని అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్స్ లో 5 స్పీడ్ గేర్ బాక్స్, ఆటోమేటిక్ లో 4 స్పీడ్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. ఇంక ఈ కారు మైలేజ్ విషయానికి వస్తే.. మాన్యువల్ ట్రాన్స్ మిషన్స్ లో లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ లో లీటరుకు 16.39 కిలోమీటర్లు అందిస్తుందని చెబుతున్నారు. ఇంక ఇంటిరియర్ కి మంచి మార్కులే పడుతున్నాయి. అలాగే 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. అలాగే ఆఫ్ రోడ్ కి ఉపయోగపడేలా.. హెడ్ లైట్స్ కి వాషర్ కూడా ఉంటుంది. అలాగే సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇంక 211 లీటర్స్ బూట్ స్పేస్ తో వస్తోంది. మరి.. ఈ జిమ్మీ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి