iDreamPost

మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

బంగారం అంటే మగువలు ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 2023 చివరల్లో పసిడి ధరలు చుక్కలు చూపించాయి. కొత్త ఏడాది మాత్రం వరుసగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.

బంగారం అంటే మగువలు ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 2023 చివరల్లో పసిడి ధరలు చుక్కలు చూపించాయి. కొత్త ఏడాది మాత్రం వరుసగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.

మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో రెండు నెలల క్రితం పసిడి ధరలు చుక్కలు చూపించాయి. ఒకదశలో బంగారం ఎంత ప్రియం అయ్యిందంటే.. 70 వేలకు చేరుకుంటుందా? అన్న అనుమానాలు కలిగాయి. కొత్త ఏడాది బంగారం ధరల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. వరుసగా తగ్గుముఖం పడుతూ వస్తుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి తరుణం అంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ లో మార్పుల కారణంగా పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి. కొత్త ఏడాది తర్వాత పసిడి స్థిరంగా, స్వల్పంగా తగ్గుతూ రావడం మహిళలకు సంతోషకరమైన విషయం అంటున్నారు. మార్చి నెలలో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వస్తుంది.. మరోసారి పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయో చూద్దాం..

గత ఏడాది 24 క్యారెట్ల బంగారం ధరలు ఏకంగా రూ.65 వేలకు చేరుకుంది. దీంతో కొత్త ఏడాది పసిడి ధరలు మరింత ప్రియం అవుతాయని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల నుంచి స్థిరంగా, తగ్గుతూ రావడంతో మహిళలు జ్యులరీ షాపులకు బాగా వస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ఏది ఏమైనా పసిడి తగ్గినపుడు కొంటే కలిసి వస్తుందని అంటున్నారు నిపుణులు. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కనుక ఇప్పుడే బంగారం కొనిపెట్టుకుంటే ఫ్యూచర్ లో ఇబ్బంది ఉండదని కొనుగోలుదారులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,700 కు చేరింది, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,950 వద్ద ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.

today gold rates

దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850 వద్ద ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,100 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,490 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ముంబై తో పాటు బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,700 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.62,950 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, పుణె, కిలో వెండి ధర రూ.76,600 వద్ద కొనసాగుతుంది. కేరళ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి