iDreamPost

Jagan : ఏపి ముఖ్యమంత్రి పేరుతో పాత సినిమా

1983 సంవత్సరం. దాసరి నారాయణరావు మంచి ఫామ్ లో ఉన్నారు. 1981లో అరవై ఏళ్ళ అక్కినేనితో తీసిన ప్రేమాభిషేకం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం చూసి ఎవరికీ నోటమాట రాలేదు.

1983 సంవత్సరం. దాసరి నారాయణరావు మంచి ఫామ్ లో ఉన్నారు. 1981లో అరవై ఏళ్ళ అక్కినేనితో తీసిన ప్రేమాభిషేకం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం చూసి ఎవరికీ నోటమాట రాలేదు.

Jagan : ఏపి ముఖ్యమంత్రి పేరుతో పాత సినిమా

జగన్ అంటే వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గుర్తొస్తారు కానీ ఆ పేరు మీద ఓ సినిమా ఉందన్న విషయం ఇప్పటి తరానికి అంతగా అవగాహన ఉండకపోవచ్చు. ఆ విశేషాలు చూద్దాం. 1983 సంవత్సరం. దాసరి నారాయణరావు మంచి ఫామ్ లో ఉన్నారు. 1981లో అరవై ఏళ్ళ అక్కినేనితో తీసిన ప్రేమాభిషేకం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం చూసి ఎవరికీ నోటమాట రాలేదు. తర్వాత ఆ ప్రస్థానాన్ని కొనసాగించారు. మధ్యలో కొన్ని ఫ్లాపులు ఉన్నప్పటికీ దీపారాధన, కృష్ణార్జునులు, బొబ్బిలిపులి, స్వయంవరం, మేఘసందేశం, ఎమ్మెల్యే ఏడుకొండలు, రాముడు కాదు కృష్ణుడు, బహుదూరపు బాటసారి, పోలీసు వెంకటస్వామి గొప్ప విజయాలు సాధించాయి.

జగన్ పేరు అందాలనటుడి ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. 1972లో వచ్చిన మానవుడు దానవుడు సినిమాలో ఆ పేరుతో చేసిన క్యారెక్టర్ మాస్ కి ఓ రేంజ్ లో ఎక్కేసింది. అభిమానులు కొందరు తమ పిల్లలకు జగన్ అని నామకరణం చేశారు కూడా. ఆ సమయంలో దాసరి శోభన్ బాబుని డ్యూయల్ రోల్ లో చూపిస్తూ ఈ జగన్ ని ప్లాన్ చేసుకున్నారు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా కెఎస్ హరి ఛాయాగ్రహణం అందించారు. జయసుధ, సుమలత హీరోయిన్లు కాగా జగ్గయ్య, గొల్లపూడి, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, జయమాలిని ఇతర తారాగణం. కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు అన్నీ దాసరి గారే రాసుకున్నారు.. ఆసక్తికరంగా ఇందులో రాజకీయాలకు ముడిపడిన కథాంశం ఉండటం గమనించాల్సిన అంశం. మాజీ, తాజా సిఎంల మధ్య డ్రామాని ఇందులో జొప్పించారు.

శోభన్ బాబు పాత్రలకు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కాన్సెప్ట్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా రాసుకున్నారు దాసరి. అయితే సెన్సార్ కు వెళ్ళినప్పుడు అసలు సమస్య ఎదురయ్యింది. ఇందులో ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఉన్నసన్నివేశాల పట్ల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే చాలాసార్లు ఇలాంటి అడ్డంకులు ఎదురుకోవడం అలవాటైన దాసరి తగ్గలేదు. రివిజన్ కోసం ప్రింట్ ముంబైకు వెళ్ళింది. అక్కడ వ్యవహారం అంత సులభంగా తెమల్లేదు. దీంతో ఫిబ్రవరిలో అనుకున్న విడుదల కాస్తా 1984 మార్చి 10కి చేరుకుంది. రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ అభిమానుల వరకు సంతృప్తి చెందేలా కమర్షియల్ సక్సెస్ దక్కించుకుంది. అప్పటికే అదే నెల 2న రిలీజైన శ్రీవారికి ప్రేమలేఖ ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడం జగన్ మీద కొంత ప్రభావం చూపించింది.

Also Read : Ram Robert Rahim : బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్ లో కృష్ణ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి